- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పంతా గూగుల్ మ్యాప్‌దే!
ఇటీవల 15వ పుట్టినరోజు జరుపుకున్న గూగుల్ మ్యాప్‌ని తనకు అన్యాయం చేసిందంటూ ఓ వ్యక్తి అభాండాలు వేశాడు. తాను గడ్డకట్టిన నదిలో పడిపోవడానికి కారణం గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడమేనని ఆరోపణలు చేస్తున్నాడు. ఎంతోమంది నావిగేషన్ కోసం సాయం చేస్తున్న గూగుల్ మ్యాప్స్ ఇలా తప్పు చేసిందనుకోవాలా? లేక టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడిన ఆ వ్యక్తిదే తప్పు అనుకోవాలా?
అమెరికాలోని మిన్నెసోటాలో మినియాపోలిస్ సిటీలో ఈ సంఘటన జరిగింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి రాత్రి పూట నడుస్తున్నపుడు దారి తెలియడం కోసం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకున్నాడు. దాన్ని అనుసరిస్తూ గడ్డకట్టి ఉన్న మిస్సిస్సిపీ నదిని దాటడానికి ప్రయత్నించాడు. కానీ మంచు గడ్డ విరగడంతో నదిలో పీకల్లోతుకి చిక్కుకుపోయాడు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి అతన్ని రక్షించారు. రాత్రి పూట నదిలో ఏం చేస్తున్నావని అడిగితే తన గమ్యస్థానం చేరాలంటే నది దాటమని గూగుల్ మ్యాప్స్ చెప్పిందని సమాధానమిచ్చాడు.
అయితే తర్వాత మ్యాప్ స్ట్రీట్ వ్యూ చెక్ చేసిన పోలీసులు నదిని పక్కనే ఉన్న స్టోన్ ఆర్చ్ బ్రిడ్జి ద్వారా దాటాలని గూగుల్ మ్యాప్స్ చూపించిందని, ఆ వ్యక్తి తప్పుగా అర్థం చేసుకున్నాడని స్పష్టతనిచ్చారు. ఏదేమైనా ఇలా తమ తప్పుకి టెక్నాలజీని ఆరోపించడం సబబు కాదని వారు ఆ వ్యక్తికి హితవు పలికారు. మీరు కూడా గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ నమ్మకుండా అప్పుడప్పుడు దేవుడిచ్చిన మెదడుని ఉపయోగించండి.