- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆకాశం నుంచి డబ్బులు రాలాయి!
దిశ, వెబ్‌డెస్క్: డబ్బులు ఏమన్నా చెట్టుకు కాస్తాయా? డబ్బులు ఆకాశం నుంచి పడతాయా? ఇలాంటి వాక్యాలు తరచుగా వింటుంటాం. ఇండోనేషియాకు చెందిన జోసువా హుటాగలుంగ్ నిజంగానే ఆకాశం నుంచి డబ్బులు రాలడంతో ఒక్కరాత్రిలో మిలియనీర్ అయ్యాడు. ఆకాశం డబ్బులు రాలడమేంటని ఆశ్చర్యపోకండి. ఉత్తర సుమత్రాలోని కొలాంగ్‌లో జోసువా ఓ రేకుల ఇంట్లో నివసిస్తుంటాడు. పెద్ద పెద్ద పెట్టెలు తయారు చేసి అమ్ముతుంటాడు. ఓ రోజు పనిలో ఉండగా తన రేకుల ఇంటి మీద పడి, రేకును విరగ్గొట్టుకుని వచ్చి మరీ ఇంట్లో పడింది. చూసేసరికి అదొక ఉల్క. ఇప్పుడు అదే ఉల్క జోసువాను మిలియనీర్‌ను చేసింది. అందుకే ఆకాశం నుంచి డబ్బులు రాలాయి అని అనాల్సి వచ్చింది.
రేకుల కప్పును విరగ్గొట్టుకుని వచ్చి, ఇంట్లో పడిన ఈ 2.1 కేజీల ఉల్కను చూసి ముందు ఏదో రాయి అనుకున్నానని, కానీ, ముట్టుకున్నపుడు వేడిగా చేయి కాలిందని జోసువా చెప్పాడు. తర్వాత దీన్ని సీఎం1/2 కార్బోనేసియస్ కొండ్రైట్‌గా గుర్తించి, దీని వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని అక్కడికి వచ్చిన పరిశోధకులు చూసి చెప్పారు. దీని ధర గ్రాముకు 857 డాలర్లు ఉంటుందని, మొత్తంగా ఆ ఉల్క విలువ 1.85 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపారు. ఉల్కతో తనకు వచ్చిన డబ్బుతో చర్చి నిర్మిస్తానని, అలాగే తనకు కూతురు పుడితే ఆమె భవిష్యత్తు కోసం డబ్బును దాచిపెడతానని జోసువా చెప్పాడు. ఏదేమైనా అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఇది ఒక నిదర్శనం.