- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్రెండ్ అని ఇంటికి రానిస్తే భార్యపై..

X
దిశ, ఆదిలాబాద్: స్నేహం అన్నం పదానికే మచ్చతెచ్చాడు ఓ వ్యక్తి. స్నేహుతుడు అని ఇంటికి పిలిస్తే.. తన భార్యనే లోబర్చుకునే యత్నంచేసి చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నిర్మల్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బాగులవాడకు చెందిన ఓ గృహిణి ఇంటికి తన భర్త ఫ్రెండ్ దావరశెట్టి రవి అనే వ్యక్తి తరచూ వచ్చి వెళ్తుండేవాడు. దీన్నే అదనుగా తీసుకున్న రవి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోకి ప్రవేశించి ఆమెను అత్యాచారం చేయబోగా కేకలు వేసింది. అరుపులకు ఆమె కొడుకు ఇంట్లోకి రాగా అతనిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు నిర్మల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు.
Next Story