‘పోర్న్ సైట్’కు రిటైర్మెంట్ ప్రకటించిన యూజర్.. ఎందుకో తెలుసా?

by Sujitha Rachapalli |   ( Updated:2021-04-08 07:09:35.0  )
‘పోర్న్ సైట్’కు రిటైర్మెంట్ ప్రకటించిన యూజర్.. ఎందుకో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఇప్పుడు ఏ విషయమైనా సరే.. అరచేతిలో ఉండే వెపన్ ద్వారా అరక్షణంలో తెలిసిపోతోంది. ముఖ్యంగా ప్రజెంట్ టైమ్స్‌లో పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడటం కామన్‌గా మారింది. ఇందులో మంచీ, చెడు రెండూ ఉన్నప్పటికీ, చెడు ప్రభావాలే ఎక్కువని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. లాక్ డౌన్ టైమ్‌లో సెక్సువల్ కంటెంట్ కోసం ఇంటర్నెట్‌లో ఎక్కువ సెర్చ్ జరిగినట్లు పలు పరిశోధనలు పేర్కొన్నాయి. ఇక పోర్న్ సైట్లను గుడ్లప్పగించి చూసేసినట్లు నిర్ధారణ కాగా, ఓ పోర్న్ సైట్ యూజర్ ఇకపై ఆ సైట్ చూడబోనని చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

లిల్జిదబ్ అనే ఓ యూజర్ పోర్న్‌హబ్‌ సైట్‌ను చూడబోనని, సదరు సైట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించానని బహిరంగంగా పేర్కొన్నాడు. ఇందుకు కారణాన్ని కూడా వెల్లడించాడు. తనకు అందమైన, తెలివైన, ప్రేమగా చూసుకునే పార్ట్‌నర్ లభించిందని పోర్న్ సైట్‌లోని ఓ వీడియో కామెంట్స్‌ సెక్షన్‌లో రాసుకొచ్చాడు. ‘బాయ్స్‌.. ఇకపై నేను ఇందులోని అశ్లీల వీడియోలను వీక్షించబోను. రిటైర్మెంట్‌ ప్రకటించేందుకే ప్రస్తుతం ఇక్కడికి వచ్చాను. అఫీషియల్‌గా నాకు అన్నివిధాల సరైన పార్ట్‌నర్ దొరికింది, నా పార్ట్‌నర్‌ను మోసగించడం ఇష్టం లేకనే అశ్లీల సైట్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. ఎప్పటికైనా మీరు కూడా నేను చెప్పిన విషయాలను కనుగొంటారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొందరు నెటిజన్లు అతడి నిర్ణయాన్ని సమర్థించగా, మరికొందరి నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

Advertisement

Next Story