అవకాశమిస్తే.. ‘బంగ్లా’ అంతా బంగారమే!

by Shamantha N |   ( Updated:2020-03-01 05:17:55.0  )
అవకాశమిస్తే.. ‘బంగ్లా’ అంతా బంగారమే!
X

కోల్‌కతా : మమతా బెనర్జీ పాలనలో సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్) సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్ చేరిన అమిత్ షా కోల్‌కతాలోని షాహిద్ మినార్ గ్రౌండ్స్‌లోని ర్యాలీలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ‘రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురండి. మేం మీ కలలను నిజం చేస్తాం. మమతా సర్కారు.. పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి చేసేందుకు మోడీకి అవకాశమివ్వడం లేదు. మీరు కమ్యూనిస్టులకు రెండు దశాబ్దాలు, మమతా దీదీకి పది సంవత్సరాలు అవకాశమిచ్చారు. వాళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా? చేయలేదు. మాకు ఐదు సంవత్సరాలు అవకాశమివ్వండి. బెంగాల్‌ను బంగారు బెంగాల్‌గా మారుస్తాం’ అని అన్నారు. కోల్‌కతాలో నిర్వహిస్తున్న సీఏఏ అనుకూల ర్యాలీలో ప్రసంగించారు. అయితే, అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు.

Advertisement

Next Story