ఉత్కంఠంగా బెంగాల్‌ ఫలితాలు.. నందిగ్రామ్‌లో మమతా ఆధిక్యం

by Shamantha N |
Mamata Banerjee
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభం కాగా, నందిగ్రామ్‌లో నువ్వానేనా అన్నట్లుగా వుంది. దీదీ-సువేందు అధికారి హోరాహోరీగా తలపడుతున్నారు. మొదటి అరగంట వరకూ వెనుకబడ్డ మమతా బెనర్జీ అనంతరం పుంజుకుని, ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఎంసీ అభ్యర్థులు కూడా దాదాపు 80 స్థానాల్లో ఆధిత్యక కొనసాగిస్తున్నారు. చివరవరకూ టీఎంసీ ఇలాగే కొనసాగితే మళ్లీ అధికారం కొనసాగించే అవకాశం ఉంది.

Next Story

Most Viewed