సెల్ఫ్ క్వారంటైన్‌లో బాలీవుడ్ లవ్ బర్డ్స్

by Shyam |
సెల్ఫ్ క్వారంటైన్‌లో బాలీవుడ్ లవ్ బర్డ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచి తరుణం మించినా దొరకదు అన్నట్లు… కరోనా కారణంగా లాక్ డౌన్ టైంను చక్కగా యూజ్ చేసుకుంటున్నారు బాలీవుడ్ ప్రేమికులు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్లుగా బయట చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఇద్దరు… ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరనేనా అనుమానం… అర్జున్ కపూర్, మలైకా అరోరా. ఇద్దరిని జంటగా చూస్తే చాలా మంది అనుకునే మాట… ఏంటిది? అని. పెళ్లై విడాకులు తీసుకుని.. వయస్సులోనూ తన కన్న పెద్దదైనా మలైకాను యంగ్ స్టర్ అర్జున్ కపూర్ లవ్ చేయడం ఏంటి.? డేటింగ్‌లో ఉండడం ఏంటి? అని. కానీ ఈ మాటలు వారిద్దరు అస్సలు పట్టించుకోరు. ఎవరెన్ని కూతలు కూసినా… వారు మాత్రం ఎప్పుడూ ప్రేమలోకంలో విహరిస్తూనే ఉంటారు. ఇప్పుడూ అదే పని చేస్తున్నారట. దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు రద్దు కావడంతో… స్వీయ నిర్బంధంలో ఇంట్లోనే ఉంటున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే అర్జున్, మలైకాలు ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారట. మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దూరంగా ఉంటే మిస్ అయ్యే ఫీలింగ్ కలుగుతుందని… ఇలా ప్లాన్ చేసుకున్నట్లు ఉన్నారు ఈ లవ్ బర్డ్స్.

Tags: Malaika Arora, Arjun Kapur, Self Quarentine, CoronaVirus, Covid19

Advertisement

Next Story

Most Viewed