‘వర్గీకరణ రాజకీయ కుట్ర.. మాలలను తొక్కి పడేస్తున్న రాజకీయ పార్టీలు’

by Sampath |
‘వర్గీకరణ రాజకీయ కుట్ర.. మాలలను తొక్కి పడేస్తున్న రాజకీయ పార్టీలు’
X

దిశ, శామీర్ పేట్ : వర్గీకరణ సమస్య కొనసాగలి అనేది రాజకీయ కుట్రలో భాగమని జాతీయ మాల మహానాడు వ్యవస్థాపకుడు అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీలో ఆదివారం జాతీయ మాలమహానాడు 16 వ వార్షికోత్సవం, తెలంగాణ మాల మహానాడు ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సమస్యను కొనసాగించాలని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చూస్తున్నాయన్నారు.100 రోజుల్లో వర్గీకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని మోడీ వచ్చి ఏడు ఏండ్లు పడుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వర్గీకరణ రాజ్యాంగ బద్ధంగా చేపడితే మేమేమన్న వద్దు అన్నామా దమ్ముంటే రాజ్యాంగ బద్ధంగా చేపట్టాలని అన్ని రాజకీయ పార్టీలకు సూటి ప్రశ్న వేశారు. ఇప్పటి వరకు వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమాలతో మాలలు ఎంతో నష్టపోయారని, వర్గీకరణ పేరుతో మాలలను రాజకీయ పార్టీలు తొక్కి పడేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇక పై మాలలు చేయాల్సిందే త్యాగ యుద్ధమని అందుకు ప్రతి ఒక్క మాల సోదరుడు సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పాకులాడుతున్న ప్రభుత్వాలు ఎందుకు బీసీలకు ఇప్పటికే ఇవ్వలేక పోతున్నాయని, వాటి కోసం ఎవ్వరు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరీ రమేశ్, జాతీయ నేతకాని మహార్ అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శి యూ.సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, మహారాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లింగం, గిరిజన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లా నాయక్, బేరీ ఈశ్వర్, కరికే శ్రీనివాస్, దార సత్యం, మన్నె బాబూరావు, శివకుమార్, గోని సైదులు, చంద్రశేఖర్, మేడి అంజయ్య, కనిగిరి రవికుమార్, ఆసాడు పురుషోత్తం, రేకం శ్రీరాములు, మల్లికార్జున్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిప్పల నర్సింగ్ రావు, మండలాల అధ్యక్షుడు బొమ్మెర్ల నాగరాజు, బాబూరావు, కందుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed