- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ సెక్టార్‌లో రిజర్వేషన్లు కల్పించండి..
దిశ, జగిత్యాల : తెలంగాణలో కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం లేదని, కనీసం ప్రైవేట్ ఉద్యోగాల్లోనైనా స్థానిక రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో జీవన్ రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు 29శాతం పీఆర్సీ ఇస్తామని చెప్పి.. ప్రస్తుతం దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ఏపీలో 45శాతం ఇచ్చారని, తెలంగాణలోనూ 45శాతం ఇవ్వాలని కోరారు. కొత్త ఉద్యోగాల్లేవు, ఉపాధ్యాయులకు పదోన్నతుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో మండల విద్యాధికారులు లేరని, దీంతో విద్యావ్యవస్థ కుంటుపడిపోతుందని వివరించారు.
రాష్ట్రపతి ఆమోదం పొందికూడా ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ అమలు కావడం లేదని, తక్షణమే అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ తెరపైకి రావడంతోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుందని గుర్తుచేశారు. ఐటీఐఆర్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడ ఉపాధి లేక కార్మికులు గల్ఫ్కు పోయి ఉపాధి పొందుతున్నారని, రాష్ట్రానికి చెందిన 10లక్షల మంది విదేశాల్లో ఉపాధి పొందుతున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గల్ఫ్ నుంచి రెండువేల మృతదేహాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చినా ఏ ఒక్కరికీ ఆర్థికసాయం అందించిన పాపానపోలేదని పేర్కొన్నారు.
గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ నుంచి పాలనను బయటకు తీసుకొస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. గవర్నర్ అయిన పాలనను బయటకు తీసుకొచ్చేలా చొరవ చూపాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కోరారు.