- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహీంద్రా మరో ముందడుగు… ఫేస్ షీల్డ్ ల తయారీ
దిశ వెబ్ డెస్క్ :
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన నిర్ణయాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా బాధితుల కోసం .. ఇప్పటికే తన పూర్తి వేతనాన్ని అందజేశాడు. కరోనా మహమ్మారి పోరులో తన వంతు సహాకారంగా రూ. 7,500 కే అధునాతన వెంటిలేటర్ అందించడంపై దృష్టి పెట్టింది. వాస్తవానికి వీటి ఖరీదు మార్కెట్లో సుమారు రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఉండగా .. అతి తక్కువ ధరలో వెంటిలేటర్లు అందించనుండటం విశేషం. ఈ సంస్థ తాజాగా ఫేస్ షీల్డ్ ల తయారీని ప్రారంభిస్తోంది. ఫోర్డ మోటార్ నుంచి డిజైన్ తీసుకుని, వీటిని రూపొందిస్తున్నారు. మార్చి 30, సోమవారం నుంచి వీటిని తయారు చేస్తున్నట్లు సంస్థ ఎండీ పవన్ గోయెంకా వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే.. ప్రథమంగా ఫేస్ మాస్క్ లు ధరించాలి.
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అని డాక్టర్లు పదే పదే సూచిస్తున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తమై మాస్క్ లు ధరిస్తున్నారు. ఎంత మాస్క్ ధరించిన.. మన ముఖాన్ని చేతులతో ముట్టుకుంటే.. వైరస్ వ్యాప్తిని అరికట్టలేం. మన ఎంత అరికట్టకుందామన్నా… మనం గంటకు 20 సార్లకు పైగా ముఖాన్ని తాకుతామని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలింది. ఇందులో దాదాపు సగం సార్లు నేరుగా మన చేతులు కళ్లు, ముక్కు , నోటిని తాకుతాయి. అందువల్ల మనం దేన్నయినా చేత్తో ముట్టుకున్నప్పుడు దాన్నుంచి వైరస్ అంటుకుంటే.. ఆ చేతి వేళ్లతో మన కళ్లు , ముక్కు నోటిని తాకినప్పుడు వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం ఎంతైనా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేయడానికి … మహీంద్ర కొత్తగా ఫేస్ షీల్డ్ లు తయారీకి సిద్ధమయ్యింది. మార్చి 30 నుంచి వీటి ఉత్పత్తి మొదలవుతుంది. తొలుత వీటిని రోజుకు 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని సంస్థ ఎండీ పవన్ గోయెంకా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత మరింత వేగవంత చేస్తామని ఆయన అన్నారు.