మరోసారి వాహనాల ధరలు పెంచే యోచనలో మహీంద్రా

by Harish |
మరోసారి వాహనాల ధరలు పెంచే యోచనలో మహీంద్రా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మరోసారి ధరలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశీయ దిగ్గజాలు టాటా మోటార్స్, మారుతీ సుజుకి ధరలను మరోసారి పెంచనున్నట్టు ప్రకటించాయి. వస్తువుల ధరలు, ఇన్‌పుట్ వ్యయం పెరుగుతున్న కారణంగా ధరలను పెంచే అంశంపై నిశితంగా పరిశీలిస్తున్నామని ఎంఅండ్ఎం ఉన్నతాధికారి విజయ్ చెప్పారు. ఇటీవల దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు హాట్ రోల్డ్ కాయిల్(హెచ్ఆర్‌సీ) రూ. 4 వేలు, కోల్డ్ రోల్డ్ కాయిల్(సీఆర్‌సీ) రూ. 4,500 పెంచారు. దీంతో ఉక్కు టన్నుకు హెచ్ఆర్‌సీ రూ. 67 వేలు, కొనుగోలుదారులు సీఆర్‌సీ టన్నుకు రూ. 80 వేలకు లభిస్తోంది.

ఈ ధరలు మళ్లీ జూన్ ప్రారంభం నాటికి రూ. 2,000-4,000 వరకు పెంచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వస్తువుల ధరల పెరుగుదలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన పరిష్కారం దిశగా ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతానికి దీనిపై స్పష్టం లేదని’ ఎంఅండ్ఎం ఆటోమోటివ్ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ నక్రా పేర్కొన్నారు. వస్తువుల ధరలు, ఇన్‌పుట్ ఖర్చులు వల్లే వాహనాలపై ధరల పెరుగుదల ఉంటుందన్నారు. ఇది మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ధరల పెరుగుదల 1.8 శాతం నుంచి 3 శాతం మధ్య ఉంటుంది. రాబోయే కాలంలో వస్తువుల ధరలు ఎలా ఉండనున్నాయో పరిశీలిస్తామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని విజయ్ వెల్లడించారు.

Advertisement

Next Story