- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లోకి సరికొత్త మోడల్ ని విడుదల చేసిన 'మహీంద్రా'..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) తన 7-సీటర్ ఎస్‌యూవీ మోడల్ బొలెరో నియోను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ. 8.48 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. కొత్త బొలెరో మోడల్ అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని వినియోగదారులకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బొలెరో మోడల్‌తో పాటు బొలెరో నియో అమ్మకాలను కొనసాగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
“కొత్త తరం వాహనదారులకు శక్తివంతమైన సామర్థ్యం కలిగిన ఎస్‌యూవీని అందించేందుకు దీన్ని తీసుకొచ్చామని” కంపెనీ సీఈఓ ఆటోమోటివ్ డివిజన్ విజయ్ నక్రా ఓ ప్రకటనలో తెలిపారు. బొలెరో నియో బ్రాండ్‌ను తీసుకురావడం ద్వారా దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టాప్-10 ఎస్‌యూవీలలో బొలెరో వేరియంట్ కూడా స్థానం సాధించగలదనే నమ్మకం ఉందని ఆయన వివరించారు. డ్యుయెల్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ ఫీచర్లు ఈ వాహనంలో ఉన్నాయని కంపెనీ తెలిపింది.