మహేష్‌బాబు ఇంటి ముందు భారీ బందోబస్తు.. ఎందుకో తెలుసా?

by Shyam |   ( Updated:2021-05-19 01:52:47.0  )
మహేష్‌బాబు ఇంటి ముందు భారీ  బందోబస్తు.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టిపీడిస్తోంది. సామాన్యులనుండి సెలబ్రెటీల వరకు ఎవ్వరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక చిత్రపరిశ్రమలోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటీకే పలువురు నటులు కరోనా బారిన పడి కోలుకున్నారు.. ఇంకొంతమంది కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ముందునుండే కఠిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద సెక్యూరిటీని భారీగా పెంచారు. మహేష్ ఇంటికి ఎవరిని రానివ్వకుండా చూస్తున్నారు.

ఇంట్లో పనిచేసే పనివాళ్ళు మినహా మిగతావారినెవ్వరిని ఇంటిలోపలికి రానివ్వొద్దని మహేష్ తెలిపారంట. అంతేకాకుండా పనివాళ్లకు రోజూ కరోనా టెస్ట్ చేయించి లోపలికి పంపిస్తున్నారట.. ఇకపోతే మహేష్ ఇప్పటీకే కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్నారు. రెండవ టీకా తీసుకొనేంతవరకు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే తన కారణంగా ఇంట్లో ఎవరికి ఈ వైరస్ అంటకూడదని మహేష్ షూటింగ్లను బంద్ చేసి, ఇంట్లోనే ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త కథలను వింటూ తరవాత సినిమాలకు లైన్ అప్ చేస్తున్నారట మహేష్ బాబు.

Advertisement

Next Story