మహేశ్ సాంగ్‌కు 100 మిలియన్ వ్యూస్‌.. ఫ్యాన్స్ ‘మైండ్ బ్లాక్’!

by Jakkula Samataha |
మహేశ్ సాంగ్‌కు 100 మిలియన్ వ్యూస్‌.. ఫ్యాన్స్ ‘మైండ్ బ్లాక్’!
X

దిశ, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. ఈ క్రమంలో మహేశ్ నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు ప్రిన్స్. గతేడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ సాంగ్ తాజాగా 100 మిలియన్స్ వ్యూస్ సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సాంగ్‌లో మాస్ గెటప్‌లో కనిపించిన మహేశ్.. లుంగి గెటప్‌లో చేసిన డ్యాన్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా, క్యూట్ స్టెప్స్‌తో అలరించింది రష్మిక. కాగా కొవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో ప్రజెంట్ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న మహేశ్ త్వరలో ‘సర్కారు వారి పాట’ షూట్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌తో పాటు 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

Next Story