కృష్ణ పుట్టినరోజునే మహేష్ మూవీ లాంచ్

by Shyam |
కృష్ణ పుట్టినరోజునే మహేష్ మూవీ లాంచ్
X

“సరిలేరు నీకెవ్వరు” సినిమాతో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత సినిమా గురించి అభిమానుల్లో పెద్ద చర్చ జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే మహేష్ 27వ సినిమా అనుకున్నా స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో…. గీత గోవిందం ఫేం దర్శకుడు పరశురాంకు చాన్స్ ఇచ్చాడు మహేష్. పరశురాం కథ నచ్చి ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే సినిమా పూజా కార్యక్రమం కృష్ణ పుట్టినరోజు మే 31న ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి… గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర నెగటివ్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు కొత్తగా ఓటిటి ప్లాట్ ఫాం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారట. అదే రోజున ఓటిటి లాంచ్ కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నరు.

Tags: Mahesh Babu, Krishna, Parasuram, Mythri Movie Makers

Advertisement

Next Story

Most Viewed