- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ధోనీకి ఫ్యాన్ అయ్యింది అందుకే: గంగూలీ
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి నేను పెద్ద అభిమానిని అని, మైదానంలో ఒత్తిడిని అధిగమించే తీరే నన్ను అతని అభిమానిగా మార్చిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. భారత క్రికెట్‌కు ధోనీ దొరకడం తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నాడు. పుట్టినరోజు నేపథ్యంలో మహీపై గంగూలీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో ధోనీని ఎంపిక చేయాలని సెలెక్టర్లను కోరాను. కానీ, ఒక కెప్టెన్‌గా నేను జట్టును మాత్రమే ఎంచుకోగలను. నేను జట్టులోకి తీసుకున్న ధోనీ ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కానీ, అతని ఆటతీరుపై నాకు నమ్మకముంది. అందుకే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడిని 3వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాను. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ క్రికెట్‌లో అతనొక అత్యుత్తమ ఆటగాడే కాదు. మంచి ఫినిషర్ కూడా. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు జట్టును గెలిపించాలనే ఉత్సాహంతో చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ, ధోనీ మాత్రం ఒత్తిడిని జయించి ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. అదే ఎంఎస్ ధోనీ ప్రత్యేకత. అందుకే నేను మహీకి ప్రియమైన అభిమానిగా మారిపోయాను’ అని గంగూలీ చెప్పాడు.