- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్‌లో రేపటి నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభం
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో శనివారం నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను చేపట్టాలని ఎంపీడీవోలను కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, ఏపీవోలతో ఉపాధి హామీ పథకం పనులు, హరితహారం, నర్సరీల్లో మొక్కల సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ నిర్ధారణ అయిన గ్రామాల్లో తప్ప ఇతర అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలన్నారు. పని చేసే సమయంలో కూలీలు సామాజిక దూరం పాటించాలన్నారు. ముఖానికి తప్పకుండా మాస్కు ధరించాలని కోరారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఒక బృందం భౌతిక దూరం పాటిస్తూనే పనులు నిర్వహించాలన్నారు. జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలున్నవారిని పనుల్లోకి అనుమతించకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 421 మందికి కరోనా పరీక్షలు చేయించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, అదనపు పీడీ, ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
Tags: MGNLS, adilabad, start tomarrow onwords, colleter mushrafh,