మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఊరట

by Shamantha N |
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఊరట
X

ముంబయి : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నికల కమిషన్(ఈసీ) నుంచి ఊరట లభించింది. శాసన మండలికి ఎన్నికలు నిర్వహించే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ కొనసాగాలంటే ఈ నెల 28లోపు శాసనమండలి సభ్యునిగా ఎన్నిక కావలసి ఉన్నది. కానీ, కరోనా కారణంగా తొమ్మిది ఎమ్మెల్సీ ఖాళీలకు జరగాల్సిన ఎన్నికలను ఈసీ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గానీ గెలవని ఉద్ధవ్ ఠాక్రే సీఎం కుర్చీ కాపాడుకోవడం కష్టంగా మారింది. ఈ రెండు సభలకూ సభ్యునిగా లేని ఠాక్రే సీఎంగా ప్రమాణం తీసుకుని ఈ నెల 28వ తేదీతో ఆరు నెలలు ముగియనుంది. దీంతో ఈ నెల 28నాటికి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాల్సి ఉన్నది. లేదంటే సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ నుంచి ఉద్ధవ్‌కు ఊరట లభించే ప్రకటన వెలువడింది. ఈ నెల 21 నుంచి 27వ తేదీలోపు శాసన మండలిలో ఖాళీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కొశ్యారీ విజ్ఞప్తి తర్వాత ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags: maharastra, lockdown, corona, cm, uddhav thackeray, relief, assembly, council

Advertisement

Next Story