- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు
దిశ,వెబ్‌డెస్క్: తక్కువ పెట్టుబడి. తక్కువ రిస్క్. మంచి ఇన్ కమ్ కావాలి. ఏంటా బిజినెస్?ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే నా లైఫ్ సెట్ అవుతుంది. 24 గంటలూ కష్టపడి పనిచేస్తా’ అని మీరు అనుకుంటే మాత్రం పాల వ్యాపారంతో లాభాలు గడించవచ్చని అంటున్నాడు ఈ రైతు.
ఇండియా డైరీ ప్రాడక్ట్ లెక్కల ప్రకారం ప్రపంచ దేశాలకంటే భారత్ లో 13శాతం పాల ఉత్పత్తి జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 75లక్షల డైరీ ఫామ్స్ ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లే క్రితం పాల వ్యాపారం కాల్విటీ లేకపోవడం, తక్కువ ఉత్పత్తులతో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ రాను రాను పాల ఉత్పత్తి పెరిగిపోవడంతో వ్యాపారంలో భారీ లాభాల్ని అర్జిస్తున్నట్లు చెప్పాడు మహరాష్ట్రకు చెందిన రైతు.
మహారాష్ట్రలోని భీవండికి చెందిన రైతు జనార్దన్ బోయర్ గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. కానీ ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో..సొంతంగా పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడా పాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ లో డెయిరీలను నిర్వహిస్తున్నాడు. అయితే ఈ వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. బస్సులో, ట్రైన్ జర్నీలతో సమయం వృధా అవుతుందని సొంతంగా రూ. 30కోట్లు పెట్టి హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు. తన స్వగ్రామంలో రెండున్నర ఎకరాల భూమిలో హెలికాప్టర్ కోసం గ్యారేజీ నిర్మాణం చేపట్టాడు. పైలట్, టెక్నిషియన్ కోసం ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నాడు. మార్చి 15నాటికి జనార్ధన్ కు హెలికాప్టర్ అందనుంది. ప్రస్తుతం ఆ హెలికాప్టర్ ట్రయల్స్ నిర్వహించాడు. ప్రస్తుతం ఈ పాల వ్యాపారి హెలికాప్టర్ కొనుగోలు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.