- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తనాళాల్లో..పుట్టగొడుగులు
దిశ, వెబ్‌డెస్క్: అధిక పోషకాలతో పాటు, శరీరానికి అవసరమయ్యే పొటాషియం, బి, డి విటమిన్లు కలిగిన ‘పుట్టగొడుగుల’ను చాలా మంది ఆహారంగా స్వీకరిస్తారు. అయితే ఈ పుట్టగొడుగులు అధిక శాతం విషపూరితంగా ఉంటాయి. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని మష్రూమ్స్ పెంచి మార్కెట్లో అమ్ముతుంటారు. వంటకాల్లోనే కాకుండా మష్రూమ్స్‌తో కొందరు టీ కూడా చేసుకుని తాగుతుంటారు. అలా ‘మష్రూమ్స్ టీ’ తాగే ఓ వ్యక్తి వ్యక్తి రక్తనాళాల్లో విచిత్రంగా ‘మ్యాజిక్ మష్రూమ్స్’ పెరుగుతుండటం డాక్టర్లను ఆశ్చర్యపరిచింది. ‘ద జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ కన్సల్టేషన్ లియాసన్ సైకాయిట్రీ’ జర్నల్‌లో ఈ కేసు తాజాగా ప్రచురితం అయింది.
30 ఏళ్ల ఓ వ్యక్తికి బై పోలార్ డిజార్డర్‌తో పాటు, ఓపియాడ్ డిపెండెన్స్ లక్షణాలు ఉన్నాయి. వాటి నుంచి ఉపశమనం పొందడానికి సదరు వ్యక్తి మష్రుమ్ టీని తన రక్తనాళాల్లోకి ఎక్కించుకునేవాడని తన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో తన సమస్యలకు వాడే మెడిసిన్స్ వాడటం మానేయడంతో తనలో డిప్రెషన్ పెరిగిపోయిందని వాళ్లు వెల్లడించారు. మష్రుమ్ టీని తాగడం వల్ల అతనిలో అలసట, వికారం పెరిగిపోవడంతో పాటు, అతని చర్మం పసుపు రంగులోకి మారడం ప్రారంభమైంది. విరేచనాలు చేసుకోవడం, రక్తపు వాంతులు కూడా కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతడిని డాక్టర్లు పరిశీలించి..కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు అతని రక్తం బ్రెవిబాసిల్లస్ అనే సూక్ష్మజీవితో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు గురైందని, అతను ఇంజెక్ట్ చేసుకున్న మేజిక్ పుట్టగొడుగులు ఆ వ్యక్తి రక్తంలో పెరుగుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అనంతరం అతనికి అత్యవసర వైద్యసేవలు అందించగా 22రోజుల తర్వాత అతను చావుబతుకుల నుంచి బయటపడ్డాడు. మష్రుమ్ టీ తీసుకోవడం వల్ల సైకోయాక్టివ్ ఎఫెక్స్ ఉంటాయాని కచ్చితంగా చెప్పలేమని, కానీ అరుదైన కేసుల్లో మాత్రమే ‘హలూసినోజెన్ – ఇండ్యూస్డ్ పెర్సిస్టింగ్ పర్సెప్షన్ డిజార్డర్(హెచ్పీపీపీడీ)’ సమస్య వస్తుందని వైద్యులు వెల్లడించారు.