- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఆ కాపర్ ప్లాంట్ రీఓపెనింగ్ వద్దు’
by Shamantha N |
X
చెన్నై: తమిళనాడు తూతుక్కుడి(ట్యుటికొరాన్)లోని కాపర్ ప్లాంట్ రీఓపెనింగ్‌కు మద్రాస్ హైకోర్టు అనుమతించలేదు. వేదాంత లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌లన్నింటినీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 815 పేజీలున్న ఈ తీర్పు మార్చిలోనే వెలువరించాల్సింది కానీ, కరోనా కారణంగా విచారణ ఆలస్యమైందని న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానమ్, వీ భవాని సుబ్బరోయన్‌ల ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేవరకూ స్టే ఇవ్వాలన్న వేదాంత అభ్యర్థననూ కోర్టు అంగీకరించలేదు. 2018లో కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో 13 మంది మరణించి దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనానంతరం కాపర్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.
Advertisement
Next Story