- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తగ్గిన ఎల్అండ్‌టీ ఆదాయం
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ మౌలిక సదుపాయాల దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్‌టీ) నికర లాభాలు 4.87 శాతం పెరిగి రూ. 2,466.71 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు రూ. 2,352.12 కోట్లుగా నమోదైనట్టు సోమవారం పేర్కొంది.
సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 1.78 శాతం క్షీణించి రూ. 35,596.42 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ. 36,242.68 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ అత్యధిక ఆర్డర్లను అందుకున్నట్టు, దేశీయంగా అతిపెద్ద కాంట్రాక్టులను సంపాదించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ త్రైమాసికంలో అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 76 శాతం ఆర్డర్లు పెరిగాయని, వాటి విలువ రూ. 73,233 కోట్లని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.