- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్ళిచేసుకోవాలని ప్రియుడి వేధింపులు.. తట్టుకోలేక బాలిక ఏంచేసిందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపులు తాళలేక మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన కండ్రకోట దుర్గాభవానీ(16), అదే గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మైనార్టీ తీరని కారణంగా బాలిక తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోలేదు. ప్రియుడు కళ్యాణ్ ని మందలించి పంపించేశారు. దీంతో బాలిక ఇంట్లో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ లో ఉంటున్న అక్క వెంకటలక్ష్మి ఇంటికి వచ్చేసింది. ఈ విషయాన్ని అక్క వెంకటలక్ష్మి తండ్రికి తెలియజేయడంతో శనివారం తండ్రి నగరానికి వచ్చి కూతురికి నచ్చజెప్పాడు. అదే సమయంలో ప్రియుడు కళ్యాణ్ ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో బాలికను బెదిరించాడు. తనని పెళ్లిచేసుకోకపోతే బాలిక తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దుర్గాభవానీ చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.