Pedda Reddy: అక్కడ హై టెన్షన్.. వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. వీడియో వైరల్

by Indraja |   ( Updated:2024-05-14 14:14:59.0  )
Pedda Reddy: అక్కడ హై టెన్షన్.. వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తతల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురంలోని తాడిపత్రిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి నియోజకవర్గం అభ్యర్థులుగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ జేసీ అస్మిత్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఆగ్రహాంతో ఊగిపోయారు. కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. దీనితో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఘర్షణను అదుపుచేసేందుకు జేసీ అస్మిత్ రెడ్డి అక్కడ నుండి వెళ్లిపోయారు. కాని పెద్దారెడ్డి మాత్రం అక్కడే ఉండి కార్యకర్తలను రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది.

కాగా ఘర్షణలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అలానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలతో పాటు పలు వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా పెద్దారెడ్డి ఓట్ల రిగ్గింగ్‌కు యత్నించినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఈసీ కన్నెర్రజేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story