AP Elections 2024: ఎన్నికల వేళ ఈసీకి లేఖ రాసిన టీడీపీ కీలక నేత.. కారణం ఇదే..!

by Indraja |   ( Updated:2024-05-13 07:08:56.0  )
AP Elections 2024: ఎన్నికల వేళ ఈసీకి లేఖ రాసిన టీడీపీ కీలక నేత.. కారణం ఇదే..!
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అటు అసెంబ్లీఎన్నికలతోపాటుగా ఇటు సార్వత్రిక ఎన్నికలకు సైతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికలను వైసీపీ నాయకులు హింసాత్మకంగా మారుస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన వైసీపీ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తూ, అక్రమాలకు తెరలేపుతున్నారు.

ఎన్నికల ప్రక్రియ ఆరంభంకాకముందే పలు చోట్ల టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారని, అలానే ప్రతిపక్ష నేతలపై వైసీపీ దాడులు, ఇలా వైసీపీ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ తన అనుచరులతో కలిసి ఆమదాలవలసలోని పోలింగ్ బూత్ 158, 159 బూత్ లను ఆక్రమించి ఎన్నికల అక్రమాలకు తెరలేపిందని, పోలింగ్ బూత్‌ల నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను బయటకు పంపివేశారని ఆరోపిస్తూ టీడీపీ నేత దేవినేని ఉమఈసీ లేఖ రాశారు.

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం సమీమణి వాణిశ్రీ పట్టపగలే ఇలా పోలింగ్ బూత్‌లు ఆక్రమించి రిగ్గింగుకు పాల్పడటం దారుణమని లేఖలో పేర్కొన్నారు. అలానే ఆమదాలవలస లోని 158, 159 పోలింగ్ స్టేషన్లకు అదనపు బలగాలు పంపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story