గురుగ్రామ్‌లో మిడతల బెడద

by Shamantha N |
గురుగ్రామ్‌లో మిడతల బెడద
X

న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఎడారి మిడతలు స్వైరవిహారం చేశాయి. పెద్దమొత్తంలో గుంపులుగా మిడతలు శనివారం గురుగ్రామ్ చేరాయి. దీంతో పొరుగునే ఉన్న ఢిల్లీ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు బయటికి రాకుండా ఇంటికే పరిమితమై డోర్లు, కిటికీలు మూసుకోవాలని సూచించారు. మిడతలను తరిమికొట్టడానికి పెద్దపెద్ద శబ్దాలు చేయాలని సూచించారు. గురుగ్రామ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే ఎంజీ రోడ్, ఇఫ్కో చౌక్‌లనూ మిడతలు కమ్మేశాయి. ఆకాశమంతా మిడతలే ఆవరించినట్టు స్థానికులు చిత్రించిన వీడియోలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడైతే ఢిల్లీకి వీటి బెడద ఉండబోదని, అవి దారిమళ్లుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. అయితే, పంటను కాపాడుకునేందుకు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. నెలక్రితం పశ్చిమ, మధ్యభారతంలో ఈ మిడతలు దండెత్తి పంటను నష్టపరిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed