కరోనా కట్టడికి.. సూర్యాపేట దిగ్భంధనం

by Shyam |
కరోనా కట్టడికి.. సూర్యాపేట దిగ్భంధనం
X

దిశ, నల్లగొండ: సూర్యాపేటలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జిల్లాను నలువైపుల నుంచి దిగ్బంధనం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇలాంటి విపత్కర సమయంలో జిల్లా ప్రజలెవరూ భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయంపై ప్రధానంగా సమీక్షించారు. పొరుగు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సూర్యాపేట కేంద్రంలో జరిగిన విందుకు హాజరుకావడంతోనే వైరస్ ప్రబలిందన్న తుది నిర్ణయానికి అధికార యంత్రాంగం వచ్చింది. ముందుగా ఆ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్స్, వైరస్ మూలాలను ఛేదించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే లాక్‌డౌన్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. ఇకమీదట సూర్యాపేటలోకి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి జగదీష్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags: corona, raises in nalgonda, minister jagadish reddy, collector vinay krishna reddy

Advertisement

Next Story

Most Viewed