- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా ఎఫెక్ట్: చౌటుప్పల్‌లో లాక్ డౌన్

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ఎక్కడికక్కడ జనాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను ప్రకటించుకుంటున్నారు. తాజాగా.. శుక్రవారం నుంచి చౌటుప్పల్ పట్టణంలో కూడా లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ విషయాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. చౌటుప్పల్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారని, కరోనాను అరికట్టడానికి లాక్‌డౌన్ విధించాలని స్థానికుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వారంరోజుల పాటు లాక్‌డౌన్ అమలవుతుందని కావున వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవసరం ఉంటే తప్పా ప్రజలెవరూ బయటకు రావొద్దని తప్పనిసరిగా మాస్కు ధరించాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు.