- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ అవకాశంగా మర్డర్.. భర్తను ప్లాన్డ్‌గా హతమార్చిన భార్య
లాక్‌డౌన్‌ను అవకాశంగా తీసుకుని వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సహాయంతో హతమార్చిందో ఇల్లాలు. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు తిరుపతి వేగంగా వెళ్తున్న లారీని అడ్డుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా యాక్సిడెంట్ ముసుగులో జరిగిన మర్డర్‌గా బయటపడింది.
ఇంతకీ ఈమర్డర్‌కి కారణమేంటంటే.. పెద్దమండ్యం మండలం సిద్ధవరం పంచాయతీ చెర్వుముందరపల్లెకు చెందిన కాలం బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు(35)కు పదేళ్ల కిందట మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకతో వివాహమైంది. పదేళ్ల దాంపత్యానికి గుర్తుగా వారికి ముగ్గురు పిల్లలున్నారు. వివాహానంతరం ఉపాధి నిమిత్తం మదనపల్లెలోని అయోధ్యనగర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. బాలు తిరుపతిలో ట్రావెల్స్ నిర్వహిస్తూ, వారానికోసారి ఇంటికొచ్చి వెళ్తుండేవాడు.
ఈ నేపథ్యంలో కొద్ది కాలం క్రితం పుట్టింటికి దగ్గర్లోని వైఎస్సార్సీపీ నేత నాగిరెడ్డితో రేణుకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బాలుకు తెలియడంతో వారి కాపురంలో కలతలు ఏర్పడ్డాయి. దీనిపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. ట్రావెల్స్ వ్యాపారం లేకపోవడంతో బాలు ఇంటిదగ్గరే ఉంటున్నాడు. దీంతో వారి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో రేణుక ప్రియుడికి విషయం వివరించింది. దీంతో వారిద్దరూ ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం రేణుక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శనివారం నటించింది.
ప్రియుడి సూచనల మేరకు బాలును మందులు తేవాలంటూ రాత్రి 10:30 బాలును బయటకు పంపింది. దీంతో బాలు ద్విచక్రవాహనంపై నీరుగట్టువారి పల్లెలోని మెడికల్ షాపుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా సిమెంట్ లారీ ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఫిర్యాదు అందుకుని లారీని పట్టుకుని విచారించి హత్య వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. దీంతో రేణుక, నాగిరెడ్డి, లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకుని వారి కాల్‌డేటా పరిశీలించారు. నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.
Tags: murder, illegal relation, husbend murdered, chittore, madanapalle