- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోన్ మారటోరియంపై విచారణ వాయిదా!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 నేపథ్యంలో మారటోరియం పెంపు, వడ్డీ మీద వడ్డీ మాఫీ అంశాలకు సంబంధించి వేసిన రెండు పిటిషన్‌లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 5కి వాయిదా వేసింది. గతంలో జరిపిన విచారణలో వివరాలను అందించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొంత సమయం కావాలని కోరారు. అదేసమయంలో కేంద్రం, ఆర్‌బీఐ రుణాల మారటోరియంకు సంబంధించి సమగ్రమైన వివరాలను సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు కోర్టుకు వివరించారు. కావున సమగ్రమైన వివరాలను అందించడానికి మరింత గడువు కావాలని కోరగా, కోర్టు కేంద్రానికి గడువు పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, ఇదివరకు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని చెబుతూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.