ఈ బాల్యం మాకొద్దు!!

by Ravi |   ( Updated:2025-03-17 00:45:10.0  )
ఈ బాల్యం మాకొద్దు!!
X

కడుపులో ఉన్నప్పుడే

మా కోసం కాన్వెంటు జైలును

అడ్వాన్సు బుకింగ్ చేసేసారు

మేం నడక నేర్వకముందే

అక్షరాలన్నీ రావాలన్నారు

భవిష్యత్తు భవ్యంగా ఉండాలని

అడుగులు తడబడుతుండగానే

ఐఐటి పునాది కోర్సును

నా భుజాలమీద ఉంచేసారు

చెల్లికేమో తొలిపుట్టిన రోజునే

స్టెతస్కోపు మెడలో వేసేసారు

జీవితం మాదో

అమ్మానాన్నలదో

మా చిట్టి బుర్రలకు అర్థం కాదు

వాళ్ళ కలలు చిట్లిపోతే

వాటికోసం మా స్వప్నాలను

చిదిమేస్తారా ఇదేం న్యాయం

మా బంగరు బాల్యాన్ని

ఎత్తుకు పోయేందుకు

ఎంతమంది క్యూలో ఉన్నారో

ఈ అమ్మానాన్నలు

ఆ కాన్వెంటు స్కూల్

అదిగో కార్పొరేట్ కాలేజీలు

లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లూ

మర్చిపోయా ఆ మొబైల్ ఫోనూ

అబ్బో లిస్టు పెద్దదే

ఈ మనుషులకు పుట్టకుండా

ఈ చెట్టుగానో పుట్టగానో

పువ్వు గానో పురుగుగానో

పుట్టిఉంటే నా బాల్యానికి

పుట్టెడు భరోసా అయినా దొరికేది

వెన్నెల సత్యం

94400 32210

Next Story

Most Viewed