తట్టెడు తంగేడు పూల నివాళి..

by Ravi |   ( Updated:2025-01-26 23:46:21.0  )
తట్టెడు తంగేడు పూల నివాళి..
X

ఆ వార్త వినగానే అంతా నిశ్శబ్దం

పెద్దోంటి మనిషి,నిలువెత్తు రూపం.

అందరికి పెద్ద దిక్కు,

అందరినీ మురిపెంగా పలకరించే

మా మల్లన్నను కోల్పోయాము.

బాల్యంతోనే ప్రశ్నించే తత్వం

ప్రజల కోసం పదునైనా మనసు..

మాదిగ వాడల్లో పుట్టిన

మల్లన్న మరణం కలిచివేసేంది.

మాదిగోళ్ల మల్లన్న

పేదోళ్లకు అండగా నిలిచే

కష్టజీవుల కన్నీటిని తుడిచే.

అన్యాయాలను ఎదిరించి

నిలిచిన వాడు మల్లన్న.

మాయమరుమం

ఎరగని మల్లన్నను

మాటుకాసి వేట కొడవళ్ళతో

వెంటాడి కడతేర్చినారు

ఆప్యాయత,అనురాగం,

మమకారం కలగలిసిన మల్లన్న

ఒక్కసారి మతో మాట్లాడి

ముచ్చటించి పోతావా

నీ పొడుపు కథలు,

సాత్రాలు చెప్పి పోతావా

నువు లేవనే మాట

మా మదిలో లేదు

నువు వస్తావనే ఆశతో....

తనివితీరా తమ్మి అని పిలిచే

మా మల్లన్నకు తట్టెడు

తంగేడు పూలతో అశ్రు నివాళి

- వేముల గోపీనాథ్

96668 00045

Advertisement

Next Story

Most Viewed