- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
PillaZamindar : నేచురల్ స్టార్ నాని బర్త్‌డే స్పెషల్‌గా ఆ సినిమా రీ-రిలీజ్.. ఆనందంలో ఫ్యాన్స్

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక గత ఏడాది ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. ప్రస్తు్తం ‘హిట్: ది థర్డ్ కేస్’ తో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోంది. ఇక ‘హిట్-3’ (Hit-3)తోనే కాకుండా.. తాజాగా మరో మూవీ అనౌన్స్ చేశాడు ఈ హీరో. ‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని మళ్లీ అదే డైరెక్టర్‌తో జత కట్టాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్యారడైజ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇలా ప్రజెంట్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నాని కెరీర్‌లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న మూవీస్‌లో ‘పిల్ల జమీందార్’ (PillaZamindar) ఒకటి.
జి. అశోక్ (G. Ashok) దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా.. హరిప్రియ (Haripriya), బిందు మాధవి (Bindu Madhavi), రావు రమేష్, ఎమ్.ఎస్. నారాయణ, తాగుబోతు రమేశ్, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, ధనరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇందులో నాని ప్రవీణ్ జయరామరాజు అనే అహంకారి యువకుడు పాత్రలో కనిపించగా.. తన తాత ఆస్తి కోసం ముప్పతిప్పలు పడతాడు. ఈ క్రమంలోనే ప్రేమ, స్నేహం, బంధాల మధ్య విలువలను తెలుసుకుని మారతాడు. 2011లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అయితే.. ఇప్పుడు ఈ చిత్రం రీ-రిలీజ్‌కు సిద్ధం అయినట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు(ఫిబ్రవరి 24)న పిల్లజమీందార్‌ని రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. దీనిపై చిత్ర బృందం కానీ, నాని కానీ స్పందించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది. కానీ, నెట్టింట వైరల్ అవుతున్న ఈ బజ్‌తో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.