వలస

by Ravi |   ( Updated:2024-09-08 18:45:50.0  )
వలస
X

పొగగొట్టపు పట్టణంలో,

పొట్టచేత పట్టుకొని

ఎన్నెన్నో వీధులు తిరిగాం,

ఏవేవో దారులు నడిచాం

అమ్మ చేతి వంటల్ని, నాన్న గోరు ముద్దల్ని

నెమరువేసి, విసిగెను ఈ ప్రాణం

గురుతుచేసి గడిచెను మా కాలం

ఎందుకు ఈ పోరాటం, దేనికి ఈ ఆరాటం

ఎంత చేసినా ఒక్క ముద్దకే కదా

ఎంత వేగినా కానీ నిద్ర తథ్యమే కదా

సొంత ఊరు వదిలేసి, ఇంట నీడ కాదనేసి

కలలు కన్న రాజ్యాన్ని, ఏనాటికి కట్టేమో..

ఆశపడ్డ జీవితాన్ని ఎప్పటికి చుసేమో..

ఈ మత్తులో, గమ్మత్తులో

ఈది, ఎగిరి, పడి, లేచి

దాటుతున్న ఈ వంతెన

నా గమ్యం చేర్చేనో,

అగమ్యంగా మార్చేనో?

-కృష్ణ చైతన్య

9125 96747

Advertisement

Next Story