బ్లాక్ హోల్

by Ravi |   ( Updated:2024-09-08 18:45:20.0  )
బ్లాక్ హోల్
X

సుఖపడతామని విశ్వసిస్తారు

అదొక, ఎవరూ చెప్పని అబద్ధం.

నెత్తీనోరూ బాదుకు చెబుతాం.

కామా తురానాం నభయం నలజ్జ

అనుకునేరు, నశ్రవణం కూడా.

చీకటి గుహలోకి తొంగిచూడాలనే ఉత్సుకత-

ఏముందోని ఉబలాటం అందరిదీనూ..

మూణ్ణాళ్లకే కళ్లు తేలేస్తారు,

రెండు కాళ్ల జంతువులు

నాలుగుకాళ్ల జంతువులై.

వినోదించినా, విలవిల్లాడినా

ఇక అక్కడే- ప్రత్యామ్నాయం లేదు,

ప్రవేశం ఒక్కటే... నో నిష్క్రమణం...

దేశరాజు

99486 80009

Advertisement

Next Story