కాలం ఆగదు...

by Ravi |   ( Updated:2024-09-01 18:30:59.0  )
కాలం ఆగదు...
X

చరితపుటలు తిప్పి చూడు

కాలవాహినిలో అందరూ గడ్డి పోచలే..

మట్టి పొరల్లో కలిసిపోయే

బూడిద దూళులే..

కాలం నికిచ్చిన బహుమతి

నీ జీవితకాలమే

సార్థకమో నిరర్థకమో తేల్చుకో నీవే..

నిన్న నేడు రేపు

తెలుసుకో గొప్ప సత్యమిదే..

సామ్రాజ్యాలేలినా సామాన్యులకైనా

మాన్యులకైనా మూర్ఖులకైనా

పక్షపాతం లేని సామ్యవాది

కాలమొక్కటేనని గమనించుకో..

కాలరీతిని నడిచి ఖ్యాతిని మిగిల్చుకో...

నీకోసం నాకోసం

ఎవ్వరికోసం ఆగదు కాలం

నీ జీవితాన్ని ఆస్వాదిస్తూ

పదుగురికి జీవితమిచ్చి

నిల్చిపో 'మనిషి'గా కలకాలం..

శ్రీనివాస్ కాలె

90594 50418

Advertisement

Next Story