చిట్లిన ఆకాశం

by Ravi |
చిట్లిన ఆకాశం
X

ఎప్పుడు ఏడుస్తుందో మరెప్పుడు

నవ్వుతుందో తెలియదు చిన్న పిల్లలా..

కోపమెప్పుడో శాంతమెప్పుడో అర్థంకాని

మాటల వత్తిడిలో చిత్తడి బావి బాటసారి దారి

ఉరమదూ మెరవదూ కానీ కురుస్తుంది

బతుకు నడిసంద్రం అయ్యేలా

మబ్బు తెరల దాగే నవ్వు ఆమె

మనసుకన్నా విశాలం కానీ

అందమైన తడిపొడి ఆకాశం

తడిలేని ఊపిరి ఎడారి ఒకటి

ఊరు దాటని ప్రకృతి

అంతుతేలని వాతావరణం తీరు

ఊహకు చిక్కని గాలివాన! వాన గాలి!!

కిటికీ మూసుకొన్న గది తాపం

చిలుము వదిలేలా

చిల్లులు పడ్డ నీటి గుట్టలా

కురిసే బుల్లెట్ పిడుగుల చెడుగుడు

నేలకు వరమా! తీరని శాపమా!

తడిసిన బాధ కురిసిన ఆకాశానికేం

తెలుస్తుంది పిచ్చిగానీ!

ఆశాజీవి మనిషి మౌన ప్రేక్షకుడు

పొడిచే గాయాల సెలయేరుపై

చిట్లిన చంచల ఘోష అచంచల ఆకాశం

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

98493 05871

Advertisement

Next Story

Most Viewed