చరమగీతం

by Ravi |   ( Updated:2024-09-01 18:45:33.0  )
చరమగీతం
X

ఏ అమావాస్య చీకటి కాటేసిందో.....

నిన్ను ఓరవని కన్నులు

శూలాలై నీ మెడకురి బిగించాయి

ప్రాణం పోసే నీ చేతులు

కామంధుడి చేతుల్లో నలిగిపోయాయి

ప్రేమను దారపోసే నీ నోరు మూగబోయింది

భయంతో పెట్టె నీ కేకలు వినని చెవిటి లోకం

రక్షణ కోసం ఏ శిక్షణలో అలిసిపోయిందో

కపట మెరుగని నీ నవ్వు ఇక చరిత్రకు అలంకారం

నీ నిజాయితీకి ఓరవని అధికారుల రెక్కికి

ఆనవాళ్లవుగా మిగిలావు

ఊరంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే

తరుణం ఇంకా స్వేచ్ఛ లేదని

గాంధీ మాటలకూ నీవొక నిదర్శనం

ఏ నోట్లతో నీ మరణ వార్తను

తిరగరాయ ప్రయత్నిస్తున్నారో

చూసి దుఃఖస్తున్నావా

తెరవెనుక ముసుగులు

తొలగిపోయే రోజు

దూరమైనా న్యాయం దగ్గరవుతుంది

రక్షించే చేతులకే

సంకెళ్లు చెరసాలలవుతాయి

నీ రక్తపు మడులు

చూడని న్యాయ దేవత

కనులు తెరుస్తాయి

నీ మరణం మరెందరికో గుణపాఠం

మహిళా లోకానికి ఇదే చరమగీతం...

యం. లక్ష్మి

తెలుగు అధ్యాపకులు

Advertisement

Next Story