మంచి జరిగేనా?

by Ravi |
మంచి జరిగేనా?
X

జీవితమంటే

సగం బాధ సగం సంతోషం

ఎన్ని జీవితాల బాధలు

లెక్కించినా గుణించినా

సరిపోతుందా.....

తను పడ్డ క్షోభకు!

తలలో జరిగిన విస్పోటం

మనసులో కలిగే ఉపద్రవం

గుండెల్లో లోతైన కోతలు

ఏ పరికరాలు సరిపోతాయి

కొలువడానికి..

తూకం వేయగలమా?

బరువులు సరే

కిలోల్లో గ్రాముల్లో

బాధలు మరి....?

గుండెలమీద ఎన్ని టన్నులు?

పథకం ముద్దాడాల్సిన ఆవిడకు

పతనాన్ని రుచిచూపిస్తే

బాధ్యులు ఎవరో తేల్చారా?

బాధితురాలు మాత్రం తాను!

వ్యక్తులా వ్యవస్థనా

యంత్రాంగమా

ఎవరైనా కావాలని చేసిన మంత్రాంగమా!

ఏది జరిగినా మంచికే అంటారు

ఏమి మంచి జరుగుతుందో ఆమెకు

ఎదురు చూద్దామా?

ఈ మాట సరికాదేమోనని సందేహం!

ఆమె.....

అలలు ఉన్న సముద్రం

విశాల దృక్పథమున్న ఆకాశం

తట్టుకొని నిలబడిన శిఖరం

ఖగోళం లోని సూర్యగోళం!

ఒలంపిక్‌లో పాల్గొనడం

ఓ కల

తనకు మాత్రం

ఓ పీడకల!

జగ్గయ్య.జి

98495 25802

Advertisement

Next Story

Most Viewed