సమభావం

by Ravi |   ( Updated:2024-06-09 18:45:43.0  )
సమభావం
X

నీ జననం ఒక ఘటన,

మరణం ఇంకొక ఘటన!

నిన్న, నేడు, రేపు,

తల్లిదండ్రులు, తోబుట్టువులు, దాయాదులు,

బడి, చదువు - పరీక్షలు, సాధించిన స్థానాలు,

ప్రతిభా పురస్కారాలు, విజయాలు, పరాజయాలు,

ప్రేమ, పగ, పెళ్లి, పిల్లలు, బంధువులు,

ప్రాణమిత్రులు, బద్ధ శత్రువులు

ఇరుగు పొరుగు,

సహ విద్యార్థులు, సహ ఉద్యోగులు,

యజమానులు, పనివాళ్ళు,

ఇల్లు, ఊరు, రాష్ట్రం, దేశం, విశ్వం

భాష, మతం, ప్రాంతం,

ఆలోచనలు, ఉద్దేశ్యాలు,

స్థానిక నేత, అధికార పక్షం, ప్రతిపక్షం,

ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, సైన్యాధ్యక్షులు

నదులు, సముద్రాలు, పర్వతాలు,

రుతువులు, పంటలు,

వ్యాపారాలు, లాభ నష్టాలు,

నీ జననం ఒక ఘటన,

మరణం ఇంకొక ఘటన!

వీటి నడుమ సంఘటనలు

ఏవీ కావు, నీ నిర్ణయాలు!

అన్నీ యాదృచ్ఛికాలే!

కాకతాళీయాలే!

మనది ప్రేక్షక పాత్ర!

మనం నిమిత్త మాత్రం!

మరి నీకెందుకు

మిడిసిపాటు, లేదా కుంగుబాటు,

మమకారం, అహంకారం?

సమభావం అవలంబించు!

అందరి అభివృద్ధి ఆకాంక్షించు!

ఎవరూ నీ వారు కారు,

అందరూ నీవారే!

అదే జీవిత అద్వైతం !

జీవం నాదం!

వ్యక్తులు కాదు ముఖ్యం!

ధర్మస్థాపనే ప్రధానం!

ప్రొ. సీతారామరాజు సనపల

72595 20872

Advertisement

Next Story

Most Viewed