- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరంగం: ప్రయాణం ఒక చలన శీలత
ఒక్కసారి యాత్రలకు పోతే సంవత్సరం పొడుగూతా అనంతరం రీచార్జ్ అవుతుంది. తీర్థ యాత్రల ఫొటోలు, వీడియోలు ఈ రోజులలో సెల్ ఫోన్ ల ద్వారా ఎన్నో తీసుకోవచ్చు. అప్పటికప్పుడు మిత్రులతో పంచుకోవచ్చు. కొందరు అదే పనిగా ఫొటోలు వందలు వేలు తీస్తారు. కానీ, అక్కడి ప్రకృతిని ఏకాంతంగా తృప్తిగా అనుభూతి చెందరు. సెల్‌ఫోన్‌లో ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత అందరూ కళాకారులే అవుతున్నారు. సంతోషమే గాని వాళ్లు దృశ్యీకరణ మెలకువలు తెల్సుకునేవి కూడా ఇలాంటి యాత్రలోనే. ప్రయాణం కొన్ని గంటలు కల్సి మాట్లాడుకోవడం ఒక అనుభూతి ఈ ముచ్చట్లలో రాజకీయాలు, వ్యాసాలు, బాల్యం, సాహిత్యం, వ్యాపారం అన్నీ వస్తాయి. జోకులు, పాటలు, అంత్యాక్షరి అన్ని ప్రయాణంలో హాయిగా ఉంటుంది. ప్రయాణం ఒక చలన శీలత. ఇది మనుషుల ఏకాంతాన్ని ప్రకృతితో మమేకం చేస్తది.
ప్రయాణం మనసుకొక వికాసం. కడుపులున్న ముచ్చట్ల కలబోత, సహవాస యాత్ర ఒక జీవనోత్సాహం' కొత్త ప్రదేశాలు తిరగడం నిజంగానే ఒక జీవనోత్సాహం. స్థిరపడిన ఊరు నుంచి చేస్తున్న ఉద్యోగం నుంచి అలా యేడాదికోసారి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి రావడం అనేది జీవితానికి నూతనోత్తేజం. యాత్రకు వెళ్లడం అంటేనే కొత్త సంస్కృతి, కొత్త మనుషులు, పట్టణాలు, రాష్ట్రాలు చూడటం అంటే పరిశీలనా ఆసక్తి ఉండాలే గానీ, అది కండ్ల పండుగే. చారిత్రిక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు లేదా అడవులు, సముద్రాల వెంబడి, గుట్టలు కొండల వెంబడి ప్రకృతిలో ప్రయాణించడం అనేది అందరూ విధిగా చేయాల్సిన పనులు. కానీ, చాలా మంది యాత్రలను ప్రాధాన్యతా పనుల జాబితాలో చేర్చరు. ఏదో ఒక సందర్భంలో సహ మిత్రులతో, సహ ఉద్యోగులతో లేదా ఇష్టమైన స్నేహితులతో ప్రయాణం చేస్తే గమ్యస్థానం చేరే వరకు చాలా విషయాలు అనుభూతులుగా పంచుకోవచ్చు.
ప్రయాణం అంటే చూడాల్సిన ప్రదేశం లేదా క్షేత్రంతో పాటు ప్రకృతిని పట్టణాలను పల్లెలను మనుషులను భాషకు సంస్కృతిని హోటళ్లను గమనించవచ్చు. ఇవన్నీ గమనిస్తేనే ఆనందం లేదా పోయి రావలె కాబట్టి పోయివచ్చుడు కాదు, ప్రకృతితో ప్రపంచంలో సంభాషించేందుకు పోయినట్టు ప్రయాణాలు చేయాలి. ఈ రోజులలో పర్యటనలు క్షేత్రాల సందర్శనకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. టూర్ల ప్యాకేజీలు రైల్వేవాళ్లయి, ఆర్టీసీవాళ్లవి కూడా ఉన్నాయి ప్రైవేట్ టూరిజం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పిల్లలతో ప్రయాణం చేస్తే కూడా ఎంతో విజ్ఞానదాయకం. పిల్లలు పెద్దగా అయినంక తమ జీవితంలో అనుభూతిని గుర్తు చేసుకుంటరు.
ముందే తెలుసుకోవాలి
యాత్రను ప్రణాళిక చేసుకోవడంలోనే విజయవంతం అవుతుంది. రెండు మూడు నెలల ముందు ప్లాన్ చేసుకుంటే అక్కడి గదులు ప్రయాణపు టిక్కెట్లు తక్కువ ధరకు దొరుకుతాయి. పోయే ప్రదేశం గూర్చి వాతావరణం గూర్చి ముందే ఇంటర్నెట్ ద్వారా తెల్సుకోవాలి. వెళ్లే ఊర్లు, చరిత్ర, అక్కడి విశిష్టత, అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులు, ఆ ఊరు దేనికి ప్రసిద్ధి? అక్కడి విషయాలపైన కొన్ని రోజుల ముందే ఇంటర్ నెట్ సెర్చ్ చేసి తగు సమాచారం చిన్న నోట్‌బుక్‌లో రాసుకోవచ్చు. రామప్ప వెళితే రామప్ప చరిత్ర తెలుసుకోవాలి. తర్వాత అక్కడి శిల్పకళ సౌందర్యాన్ని ఎక్కువ సమయం వెచ్చించి చూడాలి.
ఏదో పోయినం వచ్చినం. ఇంకా నాలుగు స్థలాలు చూడాల్సి ఉన్నది, నుడునడు, అన్నట్టుగా కాకుండా నిమ్మళంగా చూసే విధంగానే ప్లాన్ చేసుకోవాలి. ఆయా ప్రదేశాల చారిత్రక అవగాహనతో పాటు వాతావరణం కూడా ముందే అర్థం చేసుకోవాలి. ప్రయాణం చేసేవాళ్లు తక్కువ లగేజితోనే వెళ్లాలి. లేకుంటే తిరగడం, మన బట్టల బ్యాగులు మోయడం కష్టం అవుతుంది. అట్లాగే ఎప్పుడైనా సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటే మేలు. అత్యవసర మందులు, రెగ్యులర్ మందులు వెంబడి తప్పనిసరి ఉంచుకోవాలి.
ప్రకృతితో మమేకం కావాలి
ఒక్కసారి యాత్రలకు పోతే సంవత్సరం పొడుగూతా అనంతరం రీచార్జ్ అవుతుంది. తీర్థ యాత్రల ఫొటోలు, వీడియోలు ఈ రోజులలో సెల్ ఫోన్ ల ద్వారా ఎన్నో తీసుకోవచ్చు. అప్పటికప్పుడు మిత్రులతో పంచుకోవచ్చు. కొందరు అదే పనిగా ఫొటోలు వందలు వేలు తీస్తారు. కానీ, అక్కడి ప్రకృతిని ఏకాంతంగా తృప్తిగా అనుభూతి చెందరు. సెల్‌ఫోన్‌లో ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత అందరూ కళాకారులే అవుతున్నారు. సంతోషమే గాని వాళ్లు దృశ్యీకరణ మెలకువలు తెల్సుకునేవి కూడా ఇలాంటి యాత్రలోనే.
ప్రయాణం కొన్ని గంటలు కల్సి మాట్లాడుకోవడం ఒక అనుభూతి ఈ ముచ్చట్లలో రాజకీయాలు, వ్యాసాలు, బాల్యం, సాహిత్యం, వ్యాపారం అన్నీ వస్తాయి. జోకులు, పాటలు, అంత్యాక్షరి అన్ని ప్రయాణంలో హాయిగా ఉంటుంది. ప్రయాణం ఒక చలన శీలత. ఇది మనుషుల ఏకాంతాన్ని ప్రకృతితో మమేకం చేస్తది.
అన్నవరం దేవేందర్
94407 63479