కవిత-రాజకీయం

by Ravi |
కవిత-రాజకీయం
X

రాజకీయం రాజకీయం

రాజుల కాలం నుండి నేటి వరకు రాజకీయం

లేనోడు ఉన్నోడు కావాలన్నా

ఉన్నోడు ఎగబడి తినకుండా ఉండాలన్నా

ఉన్నది ఉన్నట్లు ఉండాలన్నా, వ్యవస్థ మారాలన్నా

రాజకీయం రాజకీయం

పుట్టుక నుంచి పాడె వరకు

మధ్యలోని జీవితం సాగాలన్నా

బల్బ్ ఎల్గాలన్నా , నల్లా నీళ్లు రావాలన్నా

కూడు కావాలన్నా , తల మీద నీడ కావాలన్నా

రాజకీయం రాజకీయం

పెళ్లాం మెడలో పది తులాల బంగారం ఉండాలన్నా

పొలంలో పైరు, కళకళలాడాలన్నా

కార్మికుల హక్కులు కాపాడాలన్నా

భూస్వాములు బరి తెగించకుండా ఉండాలన్నా

రాజకీయం రాజకీయం

ప్రగతిభవన్‌లో చోటు కావాలన్నా

పల్లె‌భవన్‌లో నీ వాటా దక్కాలన్నా

నీ బిడ్డ భవిషత్తు బాగుండాలన్నా

బహుజనులు బాహుబలులు కావాలన్నా

రాజకీయం రాజకీయం

క్యాపిటలిస్టయినా, కమ్యూనిస్టయినా

సోషలిస్టయినా, చివరకు టెర్రరిస్టయినా

పెన్ను బట్టినా, గన్ను పట్టినా

బులెట్ నమ్ముకున్నా , బ్యాలెట్ నమ్ముకున్నా

రాజకీయం రాజకీయం

చదువుకున్నోడు, చదువుకోనోడు

మేధావులు అని మురిసెటోడు

కుర్చీలకు పరిమితం అయినా విపత్కరవాదులు

కడుపు నిండినోడు, హాయిగా పండేటోడు

రాజకీయం బురదమయం, నాయకులు రాబందులు

డర్టీ పాలిటిక్స్, పెట్టీ పాలిటిక్స్ అనేటోళ్లు

అవినీతిమయం, అంత దరిద్రం అనుకుంటోళ్లు

కళ్లు తెరవండి, నీకు ఆలోచించే అవకాశం ఇచ్చేది కూడా రాజకీయమే

విద్యావంతులు రాజకీయాలకు రండి, రాజీపడి జీవించకండి

పది మందికి ఓటు విలువ తెలపండి

రాజకీయ విద్యతోనే ప్రజాస్వామ్యం పదిలం అని గమనించండి

పోలింగ్ బూతులో గెలవకుండా, సమ సమాజ నిర్మాణం కల్లా అని గమనించండి.


డాక్టర్ బూర నర్సయ్యగౌడ్

మాజీ ఎంపీ, బోనగిరి

95505 55400

Advertisement

Next Story

Most Viewed