మీకంటూ కొంత స్పేస్ కావాలి

by Ravi |
మీకంటూ కొంత స్పేస్ కావాలి
X


నిజానికి చాలా మందికి యోగా, వ్యాయామం, నడక బ్యాడ్మింటన్, షటిల్, క్రికెట్, క్యారమ్స్, చెస్, సంగీతం, గానం విద్యలలో ప్రవేశం ఉండి కూడా వృత్తి ఉద్యోగాలలో పడి 'అబ్బో టైం లేదు' అనుకుంటరు. కానీ, అందరికీ 24 గంటలే. పనులను ప్రాధాన్యం ప్రకారం కేటాయించుకోవడంలోనే ఆనందం పొందవచ్చు. కవిత్వం రాసుకోవచ్చు. కథలు రాసుకోవచ్చు. ఇదే తమ కోసం తాము స్పేస్ కేటాయించుకోవడం. మిగతా సమయం కుటుంబం, ఇంకా అసలు సమయం వృత్తి, వ్యాపారం లేదా ఉద్యోగం. ఇందులో తమకు తాము తృప్తి చెందుతరు. తమకు ఇష్టమైన, అవసరమైన పనులు అలవాట్లు కొనసాగించాలంటే అందరి వృత్తులలోనివారికి సాధ్యం కాకపోవచ్చు కానీ, ఇలాంటి భావన ఒకటి రూపొందించుకోవాలి.

వృత్తిలో ఉన్నవారైనా సరే, జీవితంలో కొంచెం స్పేస్ ఉంచుకోవాలి. ఎన్ని ఒత్తిడులు ఉన్నా కొంత ఏకాంతం, కొంత ప్రశాంతత, కొంత సొంతదనపు ఆలోచనలకు సమయం అవసరం. ఈ రోజులలో అన్ని వృత్తులవారు, విద్యార్థులు 'సమయం లేదు, తొందరగా పూర్తి చేయాలి, లేదంటే బాస్ అరుస్తాడు, టార్గెట్ అచీవ్ కాలేము' అనే మీమాసంలో పడి తమ కోసం తాము జీవించలేకపోతున్నారు. కుటుంబ పోషణ కోసం పనిచేయడంలోనూ, తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కొంత సమయం లేకుంటే మరీ మనిషి యంత్రం అయి జీవితం నిస్సారమైపోతుంది. సంపాదించేవారికే పైసలు కట్టలు కట్టలు కనపడతాయి. కానీ కొందరికి మన:శాంతి దొరికది. ప్రభుత్వ ఉద్యోగులలో సైతం ఇట్లనే ఉంటది.

కొన్ని శాఖలలో బాగా పని వచ్చినవాళ్లు ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు ఆఫీసులోనే ఫైళ్లు రాసుడు సూసుడు మీదనే ఉంటరు. ఒక మనిషి లేదా ఉద్యోగి అంటే ఆయన ఒక భర్త పాత్ర తండ్రి పాత్ర కొడుకు పాత్ర మామ పాత్ర అల్లుని పాత్ర పోషించాలి. వీటితోపాటు ఉద్యోగిగా ఆయా శాఖలలో కేటాయించిన హోదా మరొక పాత్ర. ఇందులో ఏ పాత్ర అప్రధానం కాకుండా కాపాడుకోవాలి. ఏది యాత్రికం కాదు. అన్నింటినీ ప్రేమ పూర్వకంగా కొనసాగించాల్సి ఉంటుంది. ప్రయివేట్ రంగ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిచ వ్యాపార నిర్వహణ చేపట్టే ఎవరైనా పైన పెర్కొన్న అన్నింటికీ న్యాయం చేయాలి.

ప్రణాళికలు వేసుకోవాలి

మనిషికి ఇంత కళాపోషణ కూడా ఉండి ఉంటుంది. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు నాట్యం చేసి, క్రీడలందు పాల్గొని, పాటలు పాడి, సినిమాలు చూసి, కవిత్వం రాసి తాను సమాజంలో ఎదుగుతడు. ఇవన్నిటికీ అంటే, ఎవరి ఇష్టాలకు వాళ్ల తీరుగా మళ్లీ రోజు అరగంట లేదా గంట స్పేస్‌ను రిజర్వ్ చేసుకోనేట్లు ప్రణాళిక వేసుకోవాలి. ఆటపాట, మాటలే కాకుండా కనీసం తెల్లవారి లేచి రోజు ఒక గంట మైదానంలో నడవమంటే కూడా టైం లేదు అంటుంటారు. వ్యాయామం, నడక యోగ లాంటివి తమ సొంత శరీరానికి సంబంధించినవి. ఇవి ఎంత మాత్రం వృత్తి ఉద్యోగాలకు, కుటుంబ సభ్యులకు కూడా కేటాయించనివి. తమ కోసం తాము నడవడమే తమ స్పేస్ క్రియేట్ చేసుకోవడం లేదా పొద్దున ఒక గంట సాయంకాలం ఒక గంట తమకు ఇష్టమైన సందేశాన్ని వినడం, తమకు ఇష్టమైన పుస్తకాన్ని చదవడం, తమకిష్టమైన గేమ్‌లో పాల్గొనడం ఏదీ అలవాటు లేకపోతే ఊరవతల పొలం గట్ల మీద తిరిగి ప్రకృతిని ఆస్వాదించడం, వరసైన మనుషులతో పరాశ్కాలాడటం ఇవన్నీ తమకు తాము ఇష్టమైన పనులు చేయడమే.

అందులోనే తృప్తి ఉంది

నిజానికి చాలా మందికి యోగా, వ్యాయామం, నడక బ్యాడ్మింటన్, షటిల్, క్రికెట్, క్యారమ్స్, చెస్, సంగీతం, గానం విద్యలలో ప్రవేశం ఉండి కూడా వృత్తి ఉద్యోగాలలో పడి 'అబ్బో టైం లేదు' అనుకుంటరు. కానీ, అందరికీ 24 గంటలే. పనులను ప్రాధాన్యం ప్రకారం కేటాయించుకోవడంలోనే ఆనందం పొందవచ్చు. కవిత్వం రాసుకోవచ్చు. కథలు రాసుకోవచ్చు. ఇదే తమ కోసం తాము స్పేస్ కేటాయించుకోవడం. మిగతా సమయం కుటుంబం, ఇంకా అసలు సమయం వృత్తి, వ్యాపారం లేదా ఉద్యోగం. ఇందులో తమకు తాము తృప్తి చెందుతరు. తమకు ఇష్టమైన, అవసరమైన పనులు అలవాట్లు కొనసాగించాలంటే అందరి వృత్తులలోనివారికి సాధ్యం కాకపోవచ్చు కానీ, ఇలాంటి భావన ఒకటి రూపొందించుకోవాలి.

ముందు అనుకోవడం, ప్రయత్నించడం ప్రారంభిస్తే ఈ వ్యాపకాన్ని పిల్లలు కూడా ఫాలో అవుతరు. కొన్ని వృత్తులకు అసలే తీరిక ఉండకపోవచ్చు అది వేరే విషయం. మరికొన్ని ప్రభుత్వ శాఖలలోనైతే రిటైర్ అయినంకనే తిరగడం, ఇష్టమైన పనుటు చేయడం వీలైతది. అప్పటికి షుగరు, బీపీ, థైరాయిడ్ అందుకుంటే వాటి నుంచి కూడా బయట పడవచ్చు కానీ, కొంచెం లిమిట్ లైఫ్ అయిపోతది. కుటుంబంలో సభ్యులందరీకీ ఎవరి స్పేస్ వాల్లకు కేటాయించుకోవాలి. ఆ సమయంలో వాళ్లు వాళ్లలోనే లీనం కావాలి. తమకు తామే రివ్యూ చేసికోవచ్చు. స్వేచ్ఛగా ఆలోచించవచ్చు. ఏదైనా చేయవచ్చు. దీంతో మరింత ఉత్సహంగా రీచార్జి చేసినట్టుగా తమ తమ పనులకుకి వెళ్లిపోవచ్చు. ఇలాంటివన్ని చేయాలంటే చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌కు కాస్తా విరామం ఇవ్వాలి. రోజుకో గంట సేపన్న స్విచ్చాఫ్ చేస్తే హాయిగా ఉంటుంది. మనిషి సెల్‌ను బానిసలాగా వాడుకోవాలె గానీ, సెల్‌కు బానిస కాకూడదు.


అన్నవరం దేవేందర్

Advertisement

Next Story