పెరిగిన ఉద్యోగుల ఆత్మవిశ్వాసం!

by Harish |
పెరిగిన ఉద్యోగుల ఆత్మవిశ్వాసం!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఇండియాలో ఉన్న ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, రానున్న 6 నెలల్లో ఆదాయం, ఖర్చులు పెరిగే అవకాశాలున్నట్టు లింక్‌డ్ ఇన్ సర్వే తెలిపింది. దేశంలోని జూన్ 1 నుంచి 14 మధ్య జరిపిన సర్వేలో సుమారు 1350 మంది తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ఎక్కువమంది ఆత్మవిశ్వాసంతోనే ఉన్నట్టు తేలింది. మే 4 నుంచి 17 మధ్య జరిగిన సర్వేలో 1646 మంది ఉద్యోగులు పాల్గొన్నారని, వీరిలో 20 శాతం మంది భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందనే అంచనాలను తెలిపారని, 27 శాతం మంది మిగులు ఉంటుందని, 23 శాతం మంది ఖర్చులు పెరుగుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు లింక్‌డ్ ఇన్ నివేదిక స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి 14వ తేదీ మధ్య జరిపిన సర్వేలో రానున్న 6 నెలల్లో ఆదాయం, వ్యక్తిగత ఖర్చులు పెరుగుతాయని అంచనాను వెలిబుచ్చారు. ఇక ముగ్గురిలో ఒకరు తమ వద్దనున్న మిగులు, వ్యక్తిగత అప్పుల చెల్లింపులు పెరిగే పరిస్థితి ఉందని చెప్పారు. ఇక స్వల్పకాల యాజమాన్య ఆత్మవిశ్వాసం విషయంలో 50 శాతం కార్పొరేట్ సేవలు, 41 శాతం విద్యారంగం, 46 శాతం తయారీ రంగంలోని నిపుణులు తమ కంపెనీలు 6 నెలల్లో మెరుగుపడతాయనే అభిప్రాయం తెలిపారు. దీర్ఘకాల యాజమాన్య ఆత్మవిశ్వాసం పరంగా 64 శాతం తయారీ రంగంలోని, 60 శాతం కార్పొరేట్ సేవలు, 59 శాతం సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల నిపుణులు సంవత్సర కాలంలో తమ కంపెనీలు మెరుగుపడే అవకాశమున్నట్టు భావించారు.

Advertisement

Next Story