Concentration: ఏకాగ్రతను దెబ్బతీస్తున్న నిద్రలేమి

by Prasanna |
Concentration: ఏకాగ్రతను దెబ్బతీస్తున్న నిద్రలేమి
X

దిశ, ఫీచర్స్: గుండెపోటు, వివిధ అనారోగ్యాలకు దారితీస్తున్న ప్రధాన కారణాల్లో నిద్రలేమి సమస్య కూడా ఉంటోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీర్ఘకాలికాలం పాటు రాత్రిళ్లు నిద్ర పోకపోవడం, నైట్ షిఫ్టుల కారణంగా రాత్రిపూట మేల్కోవాల్సి వస్తే దానిని కవర్ చేయడానికి పగలు కూడా సరిగ్గా నిద్రలేకపోవడంతోనే అసలు సమస్య మొదలవుతుందని పేర్కొంటున్నారు. మొత్తానికి 24 గంటల్లో ఒక వ్యక్తి కనీసం 6 గంటలైనా నిద్రపోకుంటే సమస్యలు తలెత్తుతాయట. మన దేశంలో దాదాపు 40 శాతం మంది కంటినిండా నిద్రలేమి కారణంగా వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏకాగ్రత దెబ్బతినడం, జ్ఞాపశక్తి కోల్పోవడం, నరాల సంబంధిత సమస్యలు తలెత్తడం, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయని ఢిల్లీకి చెందిన డాక్టర్ కేదారినాథ్ చెప్తున్నారు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే కంటినిండా నిద్రపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. సుఖవంతమైన నిద్ర ఆరోగ్యాన్నే కాదు, ముఖ వర్ఛస్సును, శారీక అందాన్ని ఇమడింపజేస్తుందట.

స్టార్ట్‌ఫోన్ ప్రభావం

ఉరుకులూ పరుగుల జీవితం.. ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ పనుల్లో నిమగ్నమవడంతో పాటు, కొన్ని సందర్భాల్లో స్ట్రెస్‌ను ఎదుర్కొంటున్నవారు ఎందరో ఉంటున్నారు. పైగా అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన ఈరోజుల్లో చాలామంది నిద్ర మేల్కొని మరీ అందులో దూరి పోతుంటారు. రాత్రిపూట స్మార్ట్ ఫోన్‌ను మళ్లీ మళ్లీ చూడటంవల్ల నిద్రపారిపోతుంది. దీనివల్ల కూడా అనారోగ్యాలు వెంటాడుతాయి.

వేకర్స్.. స్లీపర్స్

కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, పానీయాలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కాఫీలు, టీలు, వేడి వేడి వేపుడు పదార్థాలు రాత్రిళ్లు తీసుకోవడంవల్ల నిద్ర సరిగ్గా రాదు. ఇలా నిద్రకు దూరమయ్యే వారిని నిపుణులు వేకర్స్‌‌గా పేర్కొంటున్నారు. ఇక రొట్టెలు, చపాతీలు, పెరుగు, పన్నీర్, వెన్న, చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు వంటివి తీసుకునేవారికి త్వరగా నిద్రపట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ కోవకు చెందినవారిని స్లీపర్స్‌గా పేర్కొంటున్నారు.

కనీసం 6 గంటలు

ఒక మనిషి రోజులో 7 లేదా 8 గంటలు, కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని, అప్పుడే చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఈ మధ్య సిటీల్లో నివాసం ఉంటున్నవారు చాలామంది 4 నుంచి 5 గంటలే నిద్రపోతున్నారు. దీనివల్ల స్ట్రెస్ పెరుగుతోంది. వివిధ హెల్త్ ప్రాబ్లమ్స్‌కు దారి తీస్తాయి’’ అంటున్నారు డాక్టర్ నిరుపమ. హెల్తీ‌గా ఉండాలంటే నిద్రపోయే టైమ్‌ను ఎవరికి వారు సెట్ చేసుకునే ప్రయత్నం చేయాలని ఆమె చెప్తున్నారు. నైట్ షిఫ్టుల్లో చేసేవారు డే టైంలో సరిపడా నిద్రపోవాలని, డే షిఫ్టుల్లో పనిచేసేవారు నైట్‌లో కంటినిండా నిద్రపోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed