మంగళ సూత్రం విషయంలో మహిళలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

by Hamsa |   ( Updated:2023-03-12 17:21:36.0  )
మంగళ సూత్రం విషయంలో మహిళలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సాంప్రాదాయాల ప్రకారం మహిళలకు వివాహం జరిగిన తర్వాత కొన్నిటిని తప్పకుండా ధరించాలి. మంగళసూత్రం, ఉంగరం, కాలి మెట్టెలు, నుదుట కుంకుమ ధరించడం వల్ల సమాజంలో వివాహితులకు గౌరవం తెచ్చిపెడతాయి. ప్రేమకు, నమ్మకానికి గుర్తుగా భర్త బ్రతికినంత కాలం భార్య మంగళసూత్రాన్ని ధరించాలని శాస్త్రం తెలియజేస్తుంది.

అయితే మంగళసూత్రం విషయంలో మహిళలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మంగళసూత్రం మహిళల హృదయం వద్ద ఉంటుంది కాబట్టి దానికి హెయిర్ పిన్నులు, సేఫ్టీ పిన్స్ పెడితే మంగళసూత్రంలోని శక్తిని ఆకర్షిస్తాయి. దీంతో భర్తకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే తాళిని ఎప్పుడు పడితే అప్పుడు మెడలోంచి తీస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మంగళసూత్రానికి ఉన్న నల్ల పూసలు నరదిష్టి తగలకుండా కాపాడుతాయి. భర్త నిండు ఆయుష్‌తో ఉండాలంటే భార్య మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలోంచి తీయకూడదు.

ఇవి కూడా చదవండి : Electrical transmission: ఎలక్ట్రికల్ ట్రాన్స్ మిషన్ ‘సూపర్ కండక్టివిటీ’ని కనుగొన్న సైంటిస్టులు

Advertisement

Next Story

Most Viewed