- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బతికుండగానే భర్త చేతిలో సమాధి.. యాపిల్ వాచ్‌తో హెల్ప్ కాల్
దిశ, ఫీచర్స్ : చావు బతుకుల్లో ఉన్న ఓ మహిళ ప్రాణాన్ని కాపాడటంలో యాపిల్ వాచ్ సాయపడింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ యూఎస్ మహిళ సమాధి నుంచి బయటపడిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. విషయానికొస్తే.. వాషింగ్టన్‌కు చెందిన ఒక లేడీ తన భర్త చేతిలో కత్తిపోటుకు గురై, టేప్‌తో చుట్టుచుట్టబడిన స్థితిలో అడవిలో నిస్సార సమాధిలో సజీవంగా పాతిపెట్టబడింది. ఇంతటి కఠిన పరిస్థితిలోనూ తనకు తాను సమాధిని స్వల్పంగా తవ్వుకున్న ఆమె.. తర్వాత 911కు కాల్ చేసి ప్రాణాలు నిలుపుకుంది.
యంగ్ సూక్ ఆన్(42) తన భర్త చేయ్ క్యోంగ్(53) కొద్ది రోజుల క్రితమే విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో తాజాగా ఇద్దరి మధ్య డబ్బు విషయంలో జరిగిన గొడవ భౌతిక దాడికి దారితీసింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో భార్యను కత్తితో పొడిచిన భర్త.. ఆమెను టేప్‌తో చుట్టేసి ఇంటికి చాలా దూరాన ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. అయితే తనను టేప్‌తో చుట్టి బయటకు లాక్కెళ్తుండగా ఆమె యాపిల్ వాచ్ సాయంతో 911 నంబరుకు సమాచారమిచ్చింది. అంతలోనే వాచ్‌ను పగలగొట్టిన క్యోంగ్ యంగ్ సూక్‌ను బతికుండగానే గొయ్యిలో పాతిపెట్టాడు.
ఈ ఘటన మధ్యాహ్నం జరగ్గా.. రాత్రి సమయంలో స్పృహలోకి వచ్చిన యంగ్ సూక్.. ముందుగా ఆమె నోటితో పాటు చేతులకు వేసిన టేప్‌ను అతికష్టం మీద తొలగించుకోగలిగింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా సమాధిని తవ్వుకుని బయటపడింది. మొత్తానికి తప్పించుకున్న మహిళ.. 30 నిమిషాల పాటు పరుగెత్తిన తర్వాత ఒక షెడ్డు కనబడటంతో అందులో దాక్కుంది. అక్కడి స్థానికులు 911కు కాల్ చేయడంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. తాము వెతుకుతున్న మిస్సింగ్ లేడీ తనే అని నిర్ధారించుకున్నారు. పాతిపెట్టిన సమాధి స్థలాన్ని కూడా గుర్తించి ఆమె భర్తను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.