భార్యకు భర్తపై విరక్తి ఎందుకొస్తుంది.. ఈ కారణాలు తెలుసుకుని జాగ్రత్త పడండి

by Sujitha Rachapalli |
భార్యకు భర్తపై విరక్తి ఎందుకొస్తుంది.. ఈ కారణాలు తెలుసుకుని జాగ్రత్త పడండి
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటున్నారో.. అంతే గ్రాండ్‌గా డివోర్స్ పార్టీ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇన్వైట్ చేసి ఈ ఫేజ్‌ను స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బంధంలో బంధీ అయిపోవడం కన్నా.. ఒంటరిగా స్వేచ్ఛను అనుభవించడం మంచిదని సలహాలిస్తున్నారు. మన లైఫ్ మన చేతుల్లో ఉండాలని భారీ సజెషన్స్ ఇస్తున్నారు. ఇంతకీ భార్య.. భర్త మీద ఎందుకు ఫీలింగ్స్ కోల్పోతుంది? వారు చేస్తున్న తప్పులేంటి? వాయిలెన్స్ లేకున్నా అవాయిడ్ చేయడం అత్యంత ఘోర తప్పిదమవుతుందా? నిపుణులు చెప్తున్నదేంటో చూద్దాం.

ఎమోషనల్ నెగ్లిజెన్స్

భర్త.. భార్యకు అవసరమైన ఎమోషనల్ సపోర్ట్ అందించకపోవడం భావోద్వేగ నిర్లక్ష్యంగా పరిగణించబడుతుంది. ఆమె తన ఆలోచనలు, ఆందోళనలు, భావాలు పంచుకున్నప్పుడు.. హస్బెండ్ వినీ విననట్లు వదిలేయడం, అసలు రియాక్ట్ కాకపోవడం అనేది ఎమోషనల్‌గా వెనక్కి తగ్గేలా చేస్తుంది. భావోద్వేగ అవసరాలు గుర్తించనప్పుడు లోన్లీగా, డిస్‌కనెక్టెడ్‌గా ఫీల్ అవుతుంది. వారి మధ్య పెద్దగా తగాదాలు లేకపోయినా.. ఇలాంటి డీప్ డిస్కషన్స్, నేనున్నాననే భరోసా లేనప్పుడు.. భర్త మీద ప్రేమ క్రమంగా తగ్గుతుంది. ఇలాంటి బంధం అవసరమా అనే ఆలోచనకు దారితీస్తుంది.

ప్రశంసలు లేని బంధం

ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి పడుకునే వరకు భర్తకు అన్ని విధాలుగా సమకూర్చే భార్య.. కోరుకునేది చిన్న ప్రశంస మాత్రమే. ‘‘ఈ రోజు కూర బాగుంది.. చాలా కష్టపడుతున్నావు కాసేపు రెస్ట్ తీసుకో.. నేను కిచెన్‌లో కాస్త హెల్ప్ చేస్తా’’ లాంటి చిన్న చిన్న పొగడ్తలు, ధన్యవాదాలు వైఫ్‌కు ఎనలేని ఎనర్జీని, భర్తపై ప్రేమను తెచ్చిపెడుతాయని ఓ అధ్యయనం చెప్తుంది. కానీ ఆమె పనిని గౌరవించకపోవడం, ఎటు వెళ్తుందిలే ఇక్కడే పడి ఉంటుందిగా అనే నిర్లక్ష్యం నిశ్శబ్ద కోపాన్ని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితి కాలక్రమేణా సంబంధం తెగిపోవడానికి కారణమవుతుంది.

నిరంతర విమర్శ

ఏ బంధంలోనైనా నిరంతర విమర్శ చిరాకు తెప్పిస్తుంది. భార్య చేసిన ప్రతీ పని సరిగ్గా లేదనడం, లోపాలను ఎత్తి చూపడం చేస్తూపోతే.. ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇలాంటి చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఎమోషనల్‌గా దూరం పెట్టేందుకు రీజన్‌గా మిగిలిపోతాయి. భర్తను ప్రేమించే భాగస్వామిగా కాకుండా ఓ సమస్యగా చూడటం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఆమె ఎందులో స్ట్రాంగ్‌గా ఉంటుందో.. ఏ విషయంలో పర్ఫెక్ట్ అనే విషయాల పట్ల ప్రశంసలు కురిపించడం.. తమను గొప్పగా చూస్తున్నారనే సంతోషాన్ని, ఎమోషనల్ కనెక్షన్‌ను క్రియేట్ చేయగలవు.

సాన్నిహిత్యంలో దూరం

ఒక స్త్రీ వివాహ బంధంలో శారీరకంగా దగ్గరగా ఉన్నా భావోద్వేగ పరంగా మైళ్ల దూరంలో ఉండొచ్చు. ఆప్యాయత, సాన్నిహిత్యం, లోతైన సంభాషణలు అరుదుగా జరిగినప్పుడు.. అతను భర్తలా కాకుండా ఓ రూమ్ మేట్‌గా కనిపించడం ప్రారంభం కావొచ్చు. చాలా మంది స్త్రీలు ఎమోషనల్ సపోర్ట్ అందినప్పుడు మాత్రమే తమ ఆందోళనలు, ఆలోచనలు పంచుకోగలరు. లేదంటే మానేస్తారు. ఇలా జరుగుతున్నట్లు అనిపిస్తే భర్తలు తిరిగి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. భావోద్వేగ లేదా శారీరక దూరాన్ని విస్మరించడం వల్ల స్త్రీ మరింత దూరం అవుతుంది.

ప్రాధాన్యత లేని ఫీలింగ్

భార్య ఎప్పుడూ తన జీవితంలో చివరిగా ఉండాలని కోరుకోదు. తనకు ప్రాధాన్యత దక్కాలని అనుకుంటుంది. నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడం, విలువైనదిగా భావించేలా చేయడం దీని కిందకే వస్తాయి. కానీ అలా కాకుండా పరిస్థితులు భిన్నంగా మారితే.. ఒక ఎంపికగా మిగిలిపోతే ఆ బంధానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని తగ్గిస్తుంది. హలో హజ్బెండ్.. మీ భార్య మీ శ్రద్ధను కోరుకుంటుందని గుర్తించండి.

పరిష్కారం కాని ఆగ్రహం

చిన్న చిన్న వాదనలు పరిష్కరించకుండా వదిలేస్తే అవి దీర్ఘకాలిక ఆగ్రహంగా మారతాయి. భర్త సమస్యలను పరిష్కరించకుండా విస్మరించినప్పుడు, భార్య నిరాశలను దాచుకోవడం ప్రారంభించవచ్చు. కాలక్రమేణా ఈ పరిష్కారం కాని భావాలు ప్రేమ, ఆప్యాయత లేకుండా చేస్తాయి. ఆరోగ్యకరమైన బంధం కోసం సంభాషణలు అవసరం. లేదంటే ఆ రిలేషన్ బ్రేక్ అయ్యే పరిస్థితి వస్తుంది.

Advertisement
Next Story

Most Viewed