- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ బ్యూటీ లావయ్యిందంట! విశ్వమంతా నివ్వెరపోయింది..?!
దిశ, వెబ్‌డెస్క్ః ఒక్కసారి పబ్లిక్‌లో పేరొస్తే, ఇక ప్రయివేటు ప్లేస్ అంటూ ఉండదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మన విశ్వసుందరికి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఆమె అందాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంటే 'ఆహా..!' అన్న జనం ఆమె కాస్త లావు కాగానే 'ఓహ్..!' అనేస్తున్నారు. భారతదేశం గర్వించదగ్గ మిస్‌యూనివర్స్-2021 హర్నాజ్ సంధు గురించే మనం మాట్లాడుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అందాల పోటీ వేదికపై అడిగిన అన్ని ప్రశ్నలకు అద్భుతమైన సమాధానమిచ్చిన అందమైన యువతిని చూసి భారతీయులే కాదు, ప్రపంచ దేశాల ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కాస్త బరువు పెరిగిందని తెలిసి ఏమయ్యిదంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
హర్నాజ్ అందంలో మాత్రమే కాదు, ఫిట్‌నెస్‌లో కూడా ప్రజలకు ప్రేరణగా నిలుస్తుంది. అయితే, మిస్ యూనివర్స్ 2021 కిరీటం గెలుచుకున్నకొద్ది నెలల్లో కాస్త బరువు పెరిగింది. ఈ రోజుల్లో ఆమె కొద్దిగా బొద్దుగా కనిపిస్తోంది. ఇలా ఎందుకని అడిగేవారి కోసం ఈ వివరణ తెలియాల్సిందే. అందాల పోటీ మిస్ యూనివర్స్‌లో పాల్గొనడానికి 3 రోజుల ముందు హర్నాజ్ ఆసుపత్రిలో చేరారు. అయితే, కాస్త ఇబ్బంది ఉన్నా ఈసారి పోటీలో పాల్గొనాలని తన తల్లి కోరగా ఆమే పోటీలకు సిద్ధపడింది. ఆ సమయంలో ఆమెకు గ్లూటెన్ అలర్జీ అని తెలిసింది. అది ఆమెకు ఇంతకు ముందు తెలియదు. అయితే, ప్రస్తుతం, అలాగే అప్పుడప్పుడు ఇలా బరువు పెరగడానికి ఇదే కారణం.