మీ భార్య అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుందా? ఇలా డీల్ చేయొచ్చు..

by Sujitha Rachapalli |
మీ భార్య అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుందా? ఇలా డీల్ చేయొచ్చు..
X

దిశ, ఫీచర్స్ : నిజాయితీ.. బంధానికి పునాదిగా ఉంటుంది. నమ్మకాన్ని పెంపొందిస్తుంది. సురక్షిత స్థలాన్ని ఏర్పరుస్తుంది. అదే సమయంలో అబద్ధాలు ప్రమాదంలో పడేస్తాయి. దీనివల్ల చిన్న చిన్న తప్పులు కూడా అసంబద్ధంగా కనిపిస్తాయి. ఏ విషయంలోనూ విశ్వాసంగా ఉండలేరు. ఇదే పద్ధతి కొనసాగితే బంధం విచ్చిన్నం కావచ్చు. చివరికి మళ్లీ కలుసుకోలేని పరిస్థితికి చేరవచ్చు. అందుకే మీ భాగస్వామి అబద్ధం చెప్పారని అనుకున్నప్పుడు.. ఏం చేయాలి? ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? చూద్దాం.

* కొన్ని అబద్ధాలు మోసం వంటి తీవ్రమైన నమ్మక ద్రోహాలు. అవి ఖచ్చితంగా బంధాన్ని విచ్ఛిన్నం చేసేవి కూడా కావచ్చు. మరికొన్ని పరిస్థితికి అనుగుణంగా చెప్పే చిన్న చిన్నవి. కానీ ఇవి కూడా దూరాన్ని సృష్టించగలవు. కాలక్రమేణా అపార్థాలను పెంచుతాయి. భాగస్వామి అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం, అవిశ్వాసం, రహస్య పదార్థ వినియోగం వంటివి దుర్వినియోగం కిందకు వస్తాయి. ఇవి చాలా సంక్లిష్టమైన, సూక్ష్మమైన అంశాలు.

* మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ.. అప్పుడప్పుడు అబద్ధం చెప్పొచ్చు. జనం ఇలా ఉండటం సహజం కాబట్టి మీరు ఫైర్ అయిపోకుండా.. ఆసక్తిగా స్పందించడం చాలా ముఖ్యం. అతిగా రియాక్ట్ అయితే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అబద్ధాలు చెబుతారు. మరిన్ని కష్టాలు మోసుకొస్తారు.

* మీ భాగస్వామిని అబద్ధం గురించి అడగడం ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు. అసౌకర్యంగా కూడా ఉండవచ్చు. కానీ కలిసి కూర్చుని దానిపై క్లారిటీ తెచ్చుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ‘‘మనం మాట్లాడుకున్న విషయం నువ్వు రహస్యంగా ఉంచానని నాకు చెప్పావు. కానీ నువ్వు దానిని మీ అమ్మతో పంచుకున్నానని నాకు తెలిసింది. నేను నిజంగా మోసపోయినట్లు, గందరగోళానికి గురవుతున్నట్లు అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పగలవా?’’ అని అడగండి. ప్రశాంతంగా స్పందించండి. మొదటగా కోపం, ఆగ్రహం రావచ్చు. కానీ ఆగి ఆలోచించడం చాలా ముఖ్యం.

* మీ భాగస్వామి మీకు అబద్ధం చెప్పినప్పుడు గౌరవంగా ఎలా స్పందించాలో ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సంఘర్షణను నివారించడానికి భాగస్వామికి చిన్న విషయం గురించి అబద్ధం చెప్పారా? మీరు తన పట్ల సోమరిగా, స్వార్థపూరితంగా ఉన్నారా? అదే తను కూడా చేస్తున్నారా? అని గుర్తిస్తే మీ పద్ధతి మార్చుకోండి. వివరంగా చర్చించండి.

* నిజాయితీగా ఉండకపోవడాన్ని సమర్థించలేం. కానీ పరిస్థితిని విశ్వాసంతో డీల్ చేయడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. ప్రతికూలంగా స్పందించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఓపెన్‌గా మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే బంధం బలంగా ఉంటుంది.

Advertisement
Next Story

Most Viewed